వైసీపీ అంటేనే ఫేక్.. లోకేష్ ఫైర్! ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నారని వైసీపీ ఎంపీ గురుమూర్తి చేసిన ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చారు లోకేష్. వైసీపీ అధ్యక్షుడు నుంచి కార్యకర్త వరకు అందరు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను తమ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. By V.J Reddy 11 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Lokesh: మాజీ సీఎం జగన్ పై మరోసారి ట్విట్టర్ (X) వేదికగా నిప్పులు చెరిగారు మంత్రి లోకేష్. అధ్యక్షుడు జగన్ నుంచి వైసీపీ కార్యకర్త వరకు అందరూ ఫేక్ ప్రచారమే ఆయుధంగా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీలో చికిత్సలు తగ్గించారని, ఆరోగ్యశ్రీ పథకం నిలిపివేస్తున్నారని తప్పుడు ప్రచారంలో వైసీపీ ఎంపీ గురుమూర్తి కూడా భాగమయ్యారని అన్నారు. వైసిపి అధ్యక్షుడు జగన్ నుంచి వైసీపీ కార్యకర్త వరకు అందరూ ఫేక్ ప్రచారమే ఆయుధంగా రాజకీయాలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీలో చికిత్సలు తగ్గించారని, ఆరోగ్యశ్రీ పథకం నిలిపివేస్తున్నారని తప్పుడు ప్రచారంలో వైసీపీ ఎంపీ గురుమూర్తి కూడా భాగమయ్యారు. ఫేక్‌కి ఫ్యాక్ట్‌కి తేడా తెలియని ఎంపీ గారు మీ… pic.twitter.com/JoopbBFOks — Lokesh Nara (@naralokesh) October 11, 2024 ఫేక్‌కి ఫ్యాక్ట్‌కి తేడా తెలియని ఎంపీ గారు మీ హయాంలోనే పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలను తాము చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీని పేదలకు వరంగా అందిస్తున్నట్లు తెలిపారు. తప్పుడు ప్రచారాలు మానండి ఎంపీ అంటూ చురకలు అంటించారు. మీ నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చే పనిలో మా ప్రభుత్వ సహకారం తీసుకోండి.. అప్పుడు ఎన్నుకున్న మీ ప్రజలకు న్యాయం చేసిన వారు అవుతారు అని హితవు పలికారు. #lokesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి