AP News: ప్రాణం తీసిన ఈత.. తల్లిదండ్రులకు కడుపుకోత

కడపలోని బీడీకాలనీ చెందిన జేమ్స్‌ అనే యువకుడు సిద్దవటంలోని పెన్నా నదికి స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లాడు. ఈత కొడుతుండగా ఒక్కసారిగా మడుగులో చిక్కుకుని ఊపిరాడక ప్రాణాలు వదిలాడు. తమ కుమారుడిని స్నేహితులే చంపారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

New Update
Eluru crime news

Swimming

Kadapa: స్నేహితులతో సరదాగా గడుపుదామని వెళ్లిన యువకుడు శవమై కనిపించాడు. తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చాడు.  అసలేం జరిగిందంటే.. కడప నగరంలోని బీడీకాలనీ చెందిన జేమ్స్‌ అనే యువకుడు సిద్దవటంలోని పెన్నా నదికి స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లాడు. ఈత కొడుతుండగా ఒక్కసారిగా మడుగులో చిక్కుకుని ఊపిరాడక ప్రాణాలు వదిలాడు. స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.

జేమ్స్‌ మృతిపై తల్లిదండ్రులు అనుమానం.. 

దీంతో వారు తల్లిదండ్రులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు జేమ్స్‌ని బయటికి తీశారు. అయితే జేమ్స్‌ మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడిని స్నేహితులే చంపారని ఆరోపిస్తున్నారు. విచారణ జరిపాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. జేమ్స్‌ మృతి బీడీకాలనీలో విషాదం అలుముకుంది. చేతికందిన కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  ఖమ్మంలో బరితెగిస్తున్న బురిడీ బాబాలు..తాంత్రిక పూజపేరుతో ఘోరం

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు