ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: గుడ్ న్యూస్ చెప్పనున్న చంద్రబాబు సర్కార్ AP: రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. తాజాగా ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల బీమా అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. దీనిపై రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది. By V.J Reddy 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Assembly: ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు రాజీనామా ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ అయ్యన్నపాత్రుడికి అందజేశారు. జగన్ ప్రభుత్వంలో రామాచార్యులు అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా అపాయింట్ అయ్యారు. రామాచార్యులు వ్యవహారశైలిపై టీడీపీ అసంతృప్తిగా ఉండడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. By V.J Reddy 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Talasila Raghuram: వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం పిటిషన్‌పై విచారణ వాయిదా AP: వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ తలశిల పిటిషన్ దాఖలు చేశారు. 2021లో టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. By V.J Reddy 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: ఏపీలో విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల ఏపీలో విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. వాస్తవాలు ప్రజలకు తెలిసేందుకే ఈ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఏ శాఖ చూసిన తీవ్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. తవ్వినకొద్దీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుస్తోందని అన్నారు. By V.J Reddy 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో కిడ్నీ రాకెట్ కలకలం.. 30 లక్షలు ఇస్తామని నమ్మించి... ఆర్థిక ఇబ్బందులతో కిడ్నీ అమ్ముకోవాలనుకున్నానన్నారు బాధితుడు మధుబాబు. బాషా అనే వ్యక్తి కిడ్నీ ఇస్తే రూ. 30 లక్షలు ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేశాడని వాపోయాడు. విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో తన కిడ్నీ తీసుకుని డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నాడు. By Jyoshna Sappogula 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP MLC Appireddy: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ AP: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకుమ్మడి దాడి కేసులో అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. By V.J Reddy 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : నేడు మూడో శ్వేత పత్రాన్ని విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు AP: ఈరోజు మూడో శ్వేత పత్రాన్ని ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేయనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ఇంధన శాఖపై శ్వేత పత్రాన్ని సీఎం చంద్రబాబు విడుదల చేయుయనున్నారు. కాగా ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేత పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Sand Policy: ఏపీలో ఆ విధానం రద్దు.. చంద్రబాబు సంచలన నిర్ణయం! నూతన ఇసుక పాలసీ విషయమై ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. 2019, 2021 ఇసుక పాలసీలను రద్దు చేసింది. కొత్త ఇసుక పాలసీని రూపొందించే వరకు పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. By Nikhil 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : చంద్రబాబును కలిసేందుకు జగన్ బ్యాచ్ ఐపీఎస్‌ల విశ్వప్రయత్నం AP: సీఎం చంద్రబాబును కలిసేందుకు జగన్ బ్యాచ్ ఐపీఎస్‌ల విశ్వప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసం దగ్గరకు ఐపీఎస్ సీతారామాంజయులు వెళ్లారు. కలిసేందుకు ఇష్టపడని చంద్రబాబు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కాగా జగన్ సర్కార్ లో రామాంజయులు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు. By V.J Reddy 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn