మాజీ ఎమ్మెల్యే అనుచరుల అత్యుత్సాహం.. ఆగిపోయిన ఐపీఎస్‌ పెళ్లి

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కుమార్తె వివాహంలో పార్టీ జెండాలతో అనుచరులు హంగామా చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన పెళ్లి కొడుకుపెళ్లిని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించాడు. తెలంగాణలోని గద్వాల జిల్లాలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

New Update
Police Stop Minor Girl marriage With Minor Boy  in Saidabad, Hyderabad

తన అనుచరులు చేసిన హంగామాతో ఓ మాజీ ఎమ్మెల్యే కూతురు పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. తెలంగాణలోని గద్వాల జిల్లాలో ఈ ఘటన జరిగింది. గద్వాల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూతురికి ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన యువకుడితో పెళ్లి సంబంధం కుదిరింది. వధువు డాక్టర్‌గా పనిచేస్తున్నారు.పెళ్లి కొడుకు గుజరాత్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారిగా పని చే స్తున్నారు. 

పెళ్లి సంబంధం ఖరారైన నేపథ్యంలో మంగళవారం రాత్రి గుంటూరు నగరంలోని  ప్రైవేట్ స్కూల్లో పెళ్లి నిర్వహణ కోసం ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో పెళ్లి వేదికకు వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాలతో హంగామాతోమాజీ ఎమ్మెల్యే అనుచరులు హడావుడి చేశారు. పెళ్లికి ముందు తెలంగాణ సాంప్రదాయం ప్రకారం పట్టాభిపురం మెయిన్‌ రోడ్డులోని జ్యూట్‌ మిల్లు నుంచి పెళ్లి జరిగే స్కూల్‌ వరకు పెళ్లికొడుకుతో ఊరేగింపుగా వెళ్లాలని అమ్మాయి తరపు బంధువులు చెప్పారు.

ఇది కూడా చూడండి: లెస్బియన్స్‌తో సహజీవనం చట్టబద్ధమే.. హైకోర్టు సంచలన తీర్పు

అనుచరుల అత్యుత్సాహం..

గుజరాత్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి అయిన పెళ్లి కొడుకు తాను సివిల్ సర్వీసెస్‌లో ఉన్నందున రాజకీయ జెండాలతో హడావుడి చేయడం తగదని పెళ్ళి కుమార్తె తరపు వాళ్లకు చెప్పాడు. అయితే అమ్మాయి బంధువులు, మాజీ ఎమ్మెల్యే అనుచరులు దానిని పట్టించుకోకుండా పెళ్లి వేడుక వద్ద కాంగ్రెస్‌ పార్టీ జెండాలతో హంగామా చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పెళ్లి కొడుకు పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ప్రకటించాడు.

పెళ్లి కూతురు తల్లికి గుండె పోటు..

ఈ  విషయం తెలిసి పెళ్లి కూతురు తల్లికి గుండె పోటు రావడంతో ఆమెను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు, పెళ్ళికూతురు బంధువులు పెళ్లి కొడుకు ఇంటి దగ్గర ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో  కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌ వలీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్,  సుంకర పద్మశ్రీతో పాటు  పలువురు నాయకులు వరుడి ఇంటికి చేరుకుని బుజ్జగించే ప్రయత్నాలు చేశారు.  చివరికి ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరడంతో పెళ్లి చేసుకోడానికి యువ ఐపీఎస్ అధికారి అంగీకరించాడు.

ఇది కూడా చూడండి:  ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ విచారణ కోరుతూ సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు