AP Crime: ఏపీలో విషాదం.. నీటి గుంతలో పడి ఇద్దరు దుర్మరణం

పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామ ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ఓ విద్యార్థి, ప్రైవేటు స్కూల్‌ బస్సు క్లీనర్‌ మృతి చెందారు. మృతులు కంచె సుభాష్‌, క్లీనర్‌ పెద కోటేశ్వరరావుగా గుర్తింపు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

New Update
pakala beach

AP Crime

AP Crime: పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామ సమీపంలో విషాదం చోటుచేసుకుంది.  ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ఓ విద్యార్థి, ప్రైవేటు స్కూల్‌ బస్సు క్లీనర్‌ మృతి చెందారు. పోలీసులు, బాధితులు తెలిపన ప్రకారం.. గురజాల మండలం గొట్టిముక్కల, దైద, పులిపాడు గ్రామాల్లోని విద్యార్థులను ఎక్కించుకుని దాచేపల్లిలోని చైతన్య పాఠశాలకు బస్సు బయల్దేరింది.  ఇంతలో రేడియేటర్‌ నుంచి పొగలు వచ్చాయి. డ్రైవర్‌ చిన కోటేశ్వరరావు బస్సును రోడ్డు పక్కన బస్సును నిలిపేశాడు. రేడియేటర్‌లో పోసేందుకు నీరు తీసుకురావాలని డ్రైవర్‌  క్లీనర్‌ పెద కోటేశ్వరరావు సూచించాడు.  క్లీనర్‌తోపాటు పులిపాడుకు చెందిన 5వ తరగతి విద్యార్థి కంచె సుభాష్‌ బస్సు దిగారు.

ప్రాణం తీసిన నీటి గుంత:

రోడ్డు పక్కనే ఉన్న కాల్వ ప్రవహిస్తున్న నీరు తీసుకెళ్లాడు అవి మురికిగా ఉన్నాయని డ్రైవర్‌ చెప్పడు. క్లీరన్‌ సమీప పొలంలోని నర్సరీలోకి వెళ్లి అక్కడి గుంతలోకి దిగి సీసాలో నీటిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా ఇద్దరూ జారి గుంతలో పడిపోయారు. నీటి గుంత 15 అడుగుల లోతు ఉంటుంది. ఎంతసేపటికీ వారిద్దరూ రాకపోవడంతో డ్రైవర్, ఇతర విద్యార్థులు అక్కడికి వచ్చి చూశారు. ఇద్దరూ నీటిలో మునిగినట్లు గుర్తించారు. వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. ఇంజిన్‌ సాయంతో గుంతలోని నీటిని గ్రామస్థులు తోడేశారు. మట్టిలో కూరుకుపోయిన క్లీనర్, విద్యార్థి మృతదేహాలను వెలికి తీశారు.

 డ్రైవర్‌ నిర్లక్ష్యం, కండీషన్‌లేని బస్సు కారణంగానే బిడ్డ మృత్యువాత పడ్డాడని తల్లిదండ్రులు మండి పడుతున్నారు. విద్యార్థి కంచె సుభాష్‌ తల్లిదండ్రులు శ్రీనివాసరావు, మాధవి బోరున విలపించారు. వీరు వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. క్లీనర్‌ పెద కోటేశ్వరరావు(50) సొంతూరు దాచేపల్లి మండలం ఇరికేపల్లి. ఇతడికి భార్య మంగమ్మ, దివ్యాంగుడైన కుమారుడు సందీప్‌ ఉన్నారు.  ప్రమాద విషయం తెలుసుకున్న డీఎస్పీ జగదీష్, సీఐ భాస్కర్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రభుత్వాస్పపత్రిలోని మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: శీతాకాలంలో ఈ కూరగాయతో ఎంతో ఆరోగ్యం

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు