Jamili Elections: జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
AP: జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో జమిలి ఎన్నికల విధానానికి తాము ఇప్పటికే మద్దతు ప్రకటించామన్నారు. జమిలిపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవటానికి ఏది పడితే అది మాట్లాడుతోందని మండిపడ్డారు.
CM Chandra Babu : జమిలి ఎన్నికలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో జమిలి ఎన్నికల విధానానికి తాము ఇప్పటికే మద్దతు ప్రకటించామన్నారు. జమిలిపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవటానికి ఏది పడితే అది మాట్లాడుతోందని మండిపడ్డారు. వైసీపీ నేతలు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని చెప్పారు.
స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రేపటి తరం భవిష్యత్తు కోసమే ఈ విజన్ 2047 అని చెప్పారు. 1996 నాటి ఏపీ పరిస్థితులు, 2020 నాటి పరిస్థితులు బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు కనిపిస్తాయని అన్నారు. 2047లోనూ ఇదే పునరావృతం అవుతుందని తెలిపారు. భవిష్యత్తు తరాల బాగు కోసం చేసే ప్రయత్నంలో అందరి భాగస్వామ్యం కావాలని కోరారు. సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్రా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వ తరహాలో కాకుండా ఈసారి కలెక్టర్ల సదస్సులో ఎన్నో మార్పులు తీసుకొస్తామని ప్రకటించారు. సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు-సమాధానాల రూపంలో నిర్వహిస్తాం అని చెప్పారు. ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చ అంశాలు పంపి సమాధానాలు కోరి వారి అభిప్రాయాలను తీసుకుంటామన్నారు.
ఈ నెల 16న లోక్ సభ ముందు జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది.129వ రాజ్యంగ సవరణ కింద బిల్లు ప్రవేశపెట్టనుండగా నాలుగు సవరణలు చేసే అవకాశం ఉంది. అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు’ను డిసెంబర్ 16న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించాయి. అనంతరం దీనిపై చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనున్నారు.

Also Read: రాత్రంతా నిద్రపోని అల్లు అర్జున్ భార్య, పిల్లలు.. గంట గంటకు టెన్సన్ పడుతూ...
విజన్-2047...
స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రేపటి తరం భవిష్యత్తు కోసమే ఈ విజన్ 2047 అని చెప్పారు. 1996 నాటి ఏపీ పరిస్థితులు, 2020 నాటి పరిస్థితులు బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు కనిపిస్తాయని అన్నారు. 2047లోనూ ఇదే పునరావృతం అవుతుందని తెలిపారు. భవిష్యత్తు తరాల బాగు కోసం చేసే ప్రయత్నంలో అందరి భాగస్వామ్యం కావాలని కోరారు. సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్రా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వ తరహాలో కాకుండా ఈసారి కలెక్టర్ల సదస్సులో ఎన్నో మార్పులు తీసుకొస్తామని ప్రకటించారు. సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు-సమాధానాల రూపంలో నిర్వహిస్తాం అని చెప్పారు. ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చ అంశాలు పంపి సమాధానాలు కోరి వారి అభిప్రాయాలను తీసుకుంటామన్నారు.
Also Read: తగ్గేదేలే.. అల్లు అర్జున్ అరెస్టుతో 'పుష్ప2' ఖాతాలో మరో 100కోట్లు
ఎల్లుండి పార్లమెంట్ లో బిల్లు...
ఈ నెల 16న లోక్ సభ ముందు జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది.129వ రాజ్యంగ సవరణ కింద బిల్లు ప్రవేశపెట్టనుండగా నాలుగు సవరణలు చేసే అవకాశం ఉంది. అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు’ను డిసెంబర్ 16న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించాయి. అనంతరం దీనిపై చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనున్నారు.
Also Read: తల్లి ప్రాణం తీసిన ఊయల.. మంచిర్యాలలో విషాదం
Also read: స్కూళ్లు బంద్‌పెట్టి టీచర్ల దావత్..ప్రభుత్వ అధికారులు సైతం హాజరు