రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోజుకు చాలా మంది చనిపోతున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఆగడం లేదు. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రోజుకు కొన్ని వందల, వేల సంఖ్యలో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.
Also Read: తగ్గేదేలే.. అల్లు అర్జున్ అరెస్టుతో 'పుష్ప2' ఖాతాలో మరో 100కోట్లు
ముఖ్యంగా భారతదేశ యువత ఎక్కువగా విదేశాల్లో చనిపోతుండటం అందరినీ కలిచివేస్తోంది. చదువుల కోసం, ఉద్యోగాల కోసం ఇతర దేశాలు వెళ్లిన ఇండియన్స్ అక్కడ రోడ్డు ప్రమాదాలకు గురై మరణిస్తున్నారు. ఇప్పటికి చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. తాజాగా మరొక విషాద ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
Also Read: రాత్రంతా నిద్రపోని అల్లు అర్జున్ భార్య, పిల్లలు.. గంట గంటకు టెన్సన్ పడుతూ...
తెనాలి యువతి దుర్మరణం
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీ మహిళ మృతి చెందింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ యువతి రోడ్డు ప్రమాదంలో మరణించింది. తెనాలికి చెందిన నాగశ్రీవందన పరిమళ (26) గణేష్, రమాదేవి దంపతుల కుమార్తే. ఆమె ఎంఎస్ చేయడానికి 2022 డిసెంబర్‌లో అమెరికా వెళ్లారు. ఉన్నత చదువులు చదివి తమ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలనుకున్నారు. ఉన్నత ఉద్యోగంలో చేరాలనుకున్నారు. కానీ అంతలోపే మృత్యువు కాటేసింది.
Also Read: ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’లో బిగ్ ట్విస్ట్.. 2034లోనే జమిలీ ఎన్నికలు..!
అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో చదువుతున్న ఆమె శుక్రవారం రాత్రి తన కారులో ప్రయాణిస్తుండగా.. ఒక ట్రక్ ఆ కారును ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన ఆ యువతి మృతి చెందింది. ఆమె మృత దేహాన్ని తెనాలికి పంపించడానికి తానా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు.
Also Read: రాత్రంతా నిద్రపోని అల్లు అర్జున్ భార్య, పిల్లలు.. గంట గంటకు టెన్సన్ పడుతూ...