పార్టీలో మందేసి చిందేసిన టీడీపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

బీజేపీ నేత అన్నం సతీష్ పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన పార్టీలో బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పార్టీలో మందేసి, చిందేశాడు. ఆ తర్వాత సతీష్‌కు ముద్దులు పెట్టి, మద్యం తాగుతున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

New Update
Vegesana Narendra Varma

బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మపై సీఎంవో సీరియస్ అయ్యింది. ఇటీవల జరిగిన ఓ పార్టీలో మద్యం సేవించి డ్యాన్స్ వేయడమే దీనికి కారణం. డిసెంబర్ 10న అన్నం సతీష్ బీజేపీ నేత పుట్టినరోజు సందర్భంగా పాండురంగాపురం యాగంటి రిసార్ట్‌లో అతను పార్టీ ఇచ్చారు. దీనికి హాజరైన బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ మందేసి చిందేశారు. ఇంతటితో ఆగకుండా సతీష్ బుగ్గపై ముద్దులు పెడుతూ చిందులేశారు. అతని మద్యం గ్లాసు తీసుకుని వర్మ తాగారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇది కూడా చూడండి: సైబర్ నేరాలు అరికట్టేందుకు కీలక ప్రాజెక్టు ప్రారంభించిన పోలీసులు

ఇది కూడా చూడండి:  బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు

నువ్వు నేర్పించిన క్రమశిక్షణ ఇదేనా?

వీడియో వైరల్ కావడంతో వైసీపీ పార్టీ సీఎం చంద్రబాబును ట్యాగ్ చేస్తూ.. టీడీపీ ఎమ్మెల్యేలకి నువ్వు నేర్పించిన క్రమశిక్షణ ఇదేనా? అని కూడా ప్రశ్నించింది. ఈ వీడియోపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ఒక బాధ్యతగల ఎమ్మెల్యే పదవిలో ఉండి ఇలా చేయడం ఏంటని, సభ్య సమాజానికి ఏం నేర్పుతున్నారని నెటిజన్లు అంటున్నారు. 

ఇది కూడా చూడండి:  ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ విచారణ కోరుతూ సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ

ఇది కూడా చూడండి: Bengaluru: ఫ్లాట్ మేట్ కోసం ఎక్స్‌లో పోస్ట్..3లక్షలకు పైగా వ్యూస్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు