భారీ ఎన్కౌంటర్.. మరో కీలకనేత మృతి
నారాయణపూర్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరో కీలక నేత కూడా మృతి చెందాడు. మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో అవామ్-ఇ-జంగ్ ఎడిటోరియల్ చీఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జా నాగేశ్వరరావు మరణించాడు.
నారాయణపూర్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరో కీలక నేత కూడా మృతి చెందాడు. మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో అవామ్-ఇ-జంగ్ ఎడిటోరియల్ చీఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జా నాగేశ్వరరావు మరణించాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో విధులు నిర్వర్తిస్తున్న 300 మంది ఉద్యోగులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అయితే.. ఏసీలో షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
నరసరావుపేట మహిళ హత్యకేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు తన్నీరు అంకమ్మరావుకి ఉరిశిక్ష విధిస్తూ నరసరావుపేట అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి సత్యశ్రీ తీర్పు వెల్లడించారు. సలీమా అనే మహిళను హత్య చేసిన కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
ఏపీలోని పల్నాడు జిల్లాలో ఇవాళ ఉయదం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వినుకొండ మండలం శివాపురం వద్ద లారీని మినీలారీ గట్టిగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు.
ఏపీ బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. గ్రానైట్ పలకల లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ పలకల కింద పడి స్పాట్లోనే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏపీ గ్రూప్-1 అవకతవకలపై సంచలనాలు బయటపడుతున్నాయి. పరీక్ష పేపర్లను టీచర్, గృహిణీ, వెల్డర్తో దిద్దించినట్లు దర్యాప్తులో తేలింది. పేపర్ వెనుక దిద్దిన ప్రొఫెసర్ పేరు, హోదా రాయాల్సి ఉంటుంది. కానీ ఆ స్థానంలో ఈ ముగ్గురి సంతకాలు ఉండటం సంచలనం రేపుతోంది
ఏపీ మంగళగిరిలో ఘోరం జరిగింది. ట్రాన్స్జెండర్ నర్మదతో దీపక్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నర్మద ఫ్రెండ్ కోటేశ్వరరావు, దీపక్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పరువు పోయినట్లు భావించిన దీపక్.. కోటేశ్వరరావును మర్డర్ చేయించాడు.
ఏపీలో మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖా హెచ్చరించింది. విశాఖపట్నం, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్ష సూచన ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.
అమరావతి పునఃప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఇది నూతన, చారిత్రాత్మక అధ్యాయం అంటూ పోస్ట్ పెట్టారు. అమరావతి గొప్ప పట్టణ కేంద్రంగా ఆవిర్భవిస్తుందని, చంద్రబాబు దార్శనికత, నిబద్ధతను అభినందించారు.