/rtv/media/media_files/2025/10/10/this-is-the-brother-in-law-who-killed-his-brother-in-law-because-he-was-short-2025-10-10-12-41-30.jpg)
This is the brother-in-law who killed his brother-in-law because he was short.
Bapatla Crime News : మన అనుకున్నవారిని పరాయివాళ్లు పెళ్లి చేసుకుంటే కులం, మతం, ఆస్తి కోణంలో జరిగిన పరువు హత్యలను చూశాం. మరేదైనా కారణం కోసం చేసిన హత్యలను చూశాం. కానీ బాపట్ల జిల్లాలో జరిగిన హత్య కు విచిత్ర కారణం కావడం సంచలనం రేపింది. తన సోదరిని పెళ్లి చేసుకున్న వ్యక్తి పొట్టిగా ఉన్నాడనే కారణంతో బావను చంపేశాడో బావమరిది. ఈ విషయం గురించి తెలిసిన స్థానికులతోపాటు పోలీసులు కూడా షాకయ్యారు. పెళ్లి అయిన పది రోజులకే ఇలా జరగడం ఇరు కుటుంబాలను విషాదంలోకి నెట్టింది.
వివరాల ప్రకారం బాపట్ల జిల్లా వేమూరు మండలం ఏడవురు గ్రామానికి చెందిన కుర్రా గణేష్, తెనాలి ప్రాంతానికి చెందిన కీర్తి అంజనీదేవి దూరపు బంధువులు. కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. చాలా కాలంగా సాగుతున్న వీళ్ల ప్రేమను పెద్దలకు చెప్పారు. కానీ, గణేష్ పొట్టిగా ఉన్నాడని కీర్తి పేరెంట్స్ పెళ్లికి నిరాకరించారు. ఎలాగైన పెద్దవాళ్లు ఒప్పుకుంటారని చాలా కాలంగా ఎదురు చూశారు. అయినా పెద్దల మనసులు కరగలేదు. చివరకు పది రోజుల క్రితం అమరావతిలోని ఒక దేవాలయంలో గణేష్ కీర్తి జంట వివాహం చేసుకున్నారు. దీనికి స్నేహితులు సహకరించారు.
అయితే గణేష్ పొట్టిగా ఉన్నాడని కీర్తి సోదరుడు దుర్గారావు అతనిపై అసహ్యం పెంచుకున్నాడు. తన చెల్లికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో.. వివాహం జరిగిన నాడే గణేష్ అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చాడు కూడా. కొత్తగా పెళ్లి చేసుకున్న కీర్తి గణేష్ పది రోజులుగా ఆనందంగా ఉన్నారు. కానీ కీర్తి సోదరుడు దుర్గారావు మాత్రం విషయం తెలుసుకున్నప్పటి నుంచి పగతో రగిలిపోయాడు. తమకు ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుందని తన పరిచయస్తుల వద్ద పదే పదే ప్రస్తావించారు. దీంతో.. తనకు యువతి కుటుంబసభ్యులతో ప్రాణహాని ఉందని నల్లపాడు పోలీసులను గణేష్ ఆశ్రయించాడు కూడా. ప్రేమ వివాహాల సమయంలో ఇలాంటివి సర్వసాధారణమేనని పోలీసులు వారికి నచ్చజెప్పి పంపించారు. కానీ, ఇలా ఫిర్యాదు చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే గణేష్‌ను దుర్గారావు చంపేశాడు.
పెళ్లి గుడిలో చేసుకోవడంతో రిసెప్షన్ అయినా గ్రాండ్‌గా చేసుకోవాలని గణేష్, కీర్తి జంట భావించింది. ఇందుకోసం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి ఆ డబ్బులతో గణేష్ ఇంటికి పయనం అయ్యాడు. ఆ డబ్బులతో ధూంధాంగా పెళ్లి విందు ఇవ్వాలని కలలు కంటూ వస్తున్నాడు. బ్యాంకు నుంచి ఇంటికి వస్తున్న దారిలో దుర్గారావు తన స్నేహితులతో కలిసి గణేష్‌ను అడ్డగించారు. తమ ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా కీర్తిని మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటావా అని ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో గణేష్ ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. అనంతరం కత్తితో అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. కాగా, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Italy: ఆ దేశంలో బురఖా, నిఖాబ్ ధరించకూడదు..ప్రభుత్వ సంచలన నిర్ణయం