Mother-in-Law Kidnaps Son-in-Law : కుమార్తెను దూరం చేశాడని అత్త కక్ష..మాట్లాడుకుందామని పిలిచి అల్లున్ని ఏం చేశారంటే?

కూతురును తనకు దూరం చేయడంతో పాటు కూతురు, అల్లుడు తన ఇంటికి రావడం లేదని కక్ష పెంచుకున్న అత్త అల్లున్ని కిడ్నాప్‌ చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో సంచలనం సృష్టించింది. అప్రమత్తమైన పోలీసులు కేసును చేధించారు.

New Update
Mother-in-Law Kidnaps Son-in-Law

Mother-in-Law Kidnaps Son-in-Law

Mother-in-Law Kidnaps Son-in-Law : కూతురును తనకు దూరం చేయడంతో పాటు కూతురు, అల్లుడు తన ఇంటికి రావడం లేదని కక్ష పెంచుకున్న అత్త అల్లున్ని కిడ్నాప్‌ చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో సంచలనం సృష్టించింది. సీఐ సాంబశివరావు ఆదివారం దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. తెనాలికి చెందిన మణికంఠ పౌరోహిత్యం చేస్తారు. ఈయన 2021లో వినుకొండకు చెందిన విజయలక్ష్మీ  కూతురును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.ఆ ప్రేమ వివాహం యువతి తల్లి విజయలక్ష్మికి ఇష్టం లేదు.దాంతో పాటు అత్త విజయలక్ష్మి వ్యవహారశైలి నచ్చకపోవడంతో భార్యాభర్తలు వినుకొండకు వెళ్లడం లేదు. రెండేళ్లుగా మణికంఠ, అతడి భార్య విడిగానే ఉంటున్నారు. పలుమార్లు ఇంటికి రావాలని పిలిచినా కూతురు, అల్లుడు అంగీకరించలేదు. విజయలక్ష్మి మీద అనుమానంతోనే వారు అత్తింటికి వెళ్లలేదని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: సచివాలయంలో భారీ మోసం.. మంత్రి పేషీ పేరుతో కోట్లు కాజేసిన కేటుగాళ్లు

ఈ క్రమంలో వినుకొండకు చెందిన వేణుగోపాల్, గుంటూరుకు చెందిన కిరణ్, తెనాలికి చెందిన యశ్వంత్‌వర్థన్, పిడుగురాళ్లకు చెందిన కోటేశ్వరరావు తదితరులతో కలిసి విజయక్ష్మీ అద్దెకారులో శనివారం రాత్రి అల్లుడి ఇంటి వద్దకు వెళ్లింది. మాట్లాడుకుందామని బయటికి పిలిచింది. కారులో మణికంఠను ఎక్కించుకుని పారిపోయారు. వెంటనే మణికంఠ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.  వెంటనే స్పందించిన ఎస్సై కరిముల్లా సిబ్బందితో కలిసి సాంకేతికత సాయంతో కారు వెళ్లిన మార్గంలో వెంబడించారు. చేబ్రోలు మండలం శేకూరు మార్గంలో వెళ్లగా మణికంఠను కారు నుంచి దించి దాడి చేస్తున్న క్రమంలో  పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారి నుంచి మణికంఠను విడిపించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పాల్గొన్న యశ్వంత్‌వర్థన్‌ ఇప్పటికే ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడని.. ఇతనితో పాటు మరో ముగ్గురిపై కూడా రౌడీషీట్లు తెరుస్తున్నామని సీఐ వివరించారు.

Also Read :  దీపావళి విశిష్టత ఏంటి? ఈ పండుగ వేళ దీపాలను ఎందుకు వెలిగిస్తారంటే..!

Advertisment
తాజా కథనాలు