Minor Girl Marriage: వీడసలు తండ్రేనా.. మైనర్ కూతుర్ని తాగుబోతుకు అమ్మేశాడు..!

గణపవరం గ్రామానికి చెందిన ఏరువ జమలారెడ్డి తన భార్యతో గొడవపడి విడాకులు తీసుకున్నాడు. దీంతో అతడు మద్యానికి బాగా బానిసయ్యాడు. ఈ క్రమంలోనే తనకున్న పొలాన్ని అమ్ముకుని.. దాంతో వచ్చిన డబ్బుతో తాగుడు, జల్సాలు చేసేవాడు. అతడి నాగరాజు అనే స్నేహితుడు ఉన్నాడు.

New Update
ganapavaram Minor Girl Marriage

ganapavaram Minor Girl Marriage

రక్తం పంచుకు పుట్టిన కన్న కూతురిని కంటికి రెప్పలా చూసుకోవలసిన ఓ తండ్రి.. 
ఆపదలో నాన్నా అని పిలిస్తే ఆదుకోవలసిన ఓ తండ్రి.. 
కూతురి సమస్యను తీర్చాల్సిన ఓ తండ్రి.. ఎవరూ ఊహించని పని చేశాడు.

కన్నకూతుర్ని డబ్బు కోసం ఓ తాగుబోతుకు అమ్మేశాడు. ఈ ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం గణపవరం గ్రామంలో కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read :  అమ్మ మాట వింటే హిడ్మా బతికి ఉండేవాడు.. నవంబర్ 11న ఏం జరిగిందో తెలుసా?

Ganapavaram Minor Girl Marriage

గణపవరం గ్రామానికి చెందిన ఏరువ జమలారెడ్డి తన భార్యతో గొడవపడి గతంలో విడాకులు తీసుకున్నాడు. దీంతో అతడు ఒంటరిగా ఉంటూ మద్యానికి బాగా బానిసయ్యాడు. ఈ క్రమంలోనే తనకున్న పొలాన్ని అమ్ముకుని.. దాంతో వచ్చిన డబ్బుతో తాగుడు, జల్సాలు చేసేవాడు. అతడికి నాగరాజు అనే స్నేహితుడు ఉన్నాడు. 

అతడు కూడా పచ్చి తాగుబోతు. ఇద్దరూ కలిసి తరచూ తాగుతూ, తిరుగుతూ ఉండేవారు. ఇద్దరూ బావ, బావమర్ది అని పిలుచుకునేవారు. అయితే నాగరాజు ఒకరోజు తన స్నేహితుడు జమలారెడ్డితో ఒక విషయం చెప్పాడు. తన 15 ఏళ్ల కూతురినిచ్చి పెళ్లి(Minor Girl Marriage) జరిపిస్తానని.. జమలారెడ్డి నుంచి పలు దఫాలుగా డబ్బులు తీసుకున్నాడు. 

నాగరాజు ఇలా దాదాపు రూ.20 లక్షల వరకు జమలారెడ్డి వద్ద నుంచి డబ్బులు గుంజాడు. అనంతరం అతడు చెప్పినట్లుగానే ఎవరికీ తెలియకుండా జమలారెడ్డికి తన 15 ఏళ్ల కూతురినిచ్చి పెళ్లి చేశాడు. కానీ ఈ పెళ్లి ఆ బాలికకు నచ్చలేదు. దీంతో ఆమె కాపురానికి వెళ్లలేదు. ఈ క్రమంలోనే ఈ నెల అంటే నవంబర్ 12వ తేదీన నాగరాజు మరోసారి జమలారెడ్డిని డబ్బు అడిగాడు. 

దీంతో కుమార్తెను కాపురానికి ఇంటికి పంపిస్తే డబ్బు ఇస్తానని జమలారెడ్డి చెప్పాడు. వెంటనే నాగరాజు తన ఇంటివద్దనున్న కుమార్తెను తీసుకుని జమలారెడ్డి వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఆ తర్వాత జమలారెడ్డి ఆ మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె గట్టిగా కేకలు వేసి.. చుట్టుపక్కల వారిని సహాయం కోసం పిలిచింది. అనంతరం వారి సాయంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలిక తండ్రి నాగరాజు, జమలారెడ్డిలను అరెస్టు చేశారు. వారిపై పోక్సో కేసు నమోదు చేసి ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు. 

Also Read :  మరోసారి ఢిల్లీలో బాంబు బెదిరింపులు

Advertisment
తాజా కథనాలు