/rtv/media/media_files/2025/06/14/7k09wdOEyMLIvwtCeUXO.jpg)
Death
హైదరాబాద్(hyderabad) లో విషాదం చోటుచేసుకుంది. అమెరికా వీసా(America Visa Rejection) రావడం లేదని ఓ యువతి సూసైడ్(Doctor commits suicide) చేసుకుంది. గుంటూరుకు చెందిన డా.రోహిణి హైదరాబాద్‌లో ఉంటున్నారు. గత ఏడాది నుంచి ఆమె అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఆమెకు జే1 వీసా రాలేదు. దీంతో రోహిణి తీవ్ర మనస్తాపం చెందారు. తన నివాసంలో నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డారు. అమెరికా వెళ్లాలని కలలు గన్న రోహిణి ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పటికే ఆమె మృతదేహాన్ని గుంటూరుకు తరలించారు.
Also Read: తిరుమల ప్రసాదం వివాదం.. సారీ చెప్పిన శివజ్యోతి
Doctor Commits Suicide Over Visa Rejection
ఇదిలాఉండగా హైదరాబాద్‌లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి(gas-cylinder-blast) మహిళ మృతి చెందింది. మధురానగర్ పీఎస్ పరిధిలోని కమాన్‌గల్లీలో ఓ భవనం మొదటి అంతస్తులో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో సోనూ బాయ్(40) అనే మహిళ మృతి చెందింది. ఆమె తల్లిదండ్రులు గోపాల్‌సింగ్, లలితా బాయ్‌కి తీవ్రంగా గాయపడ్డారు. వీళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read: సంక్రాంతికి ఊరెళ్లుతున్నారా? బస్సులు, రైల్లు ఫుల్ రిజర్వేషన్..టికెట్ ధర ఎంతో తెలుసా?
Follow Us