AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్‌లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..

గుంటూరు నుంచి పెద్దకూరపాడు మధ్య రైలు ప్రయాణిస్తుండగా.. బోగీలోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. అతను మహిళ యొక్క హ్యాండ్‌బ్యాగ్, సెల్‌ఫోన్ లాక్కొని, ఆమె వద్ద ఉన్న డబ్బును దోచుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

New Update
rape  woman

Guntur Crime News

ప్రయాణంలో ఉన్న రైలులో ఒంటరి మహిళపై ఓ దుండగుడు దారుణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజమహేంద్రవారంలో సంత్రగచి ప్రత్యేక రైలు ఎక్కిన బాధితురాలు గుంటూరుకు చేరుకుంది. ఆ తర్వాత ఆమె ప్రయాణిస్తున్న బోగీలో మొత్తం ఖాళీగా ఉంది. గుంటూరు నుంచి పెద్దకూరపాడు మధ్య రైలు ప్రయాణిస్తుండగా.. బోగీలోకి సుమారు 40 ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి ప్రవేశించాడు. ఆ వ్యక్తి ఏదో పని ఉన్నట్లుగా ప్రాధేయపడి బోగీలోకి ప్రవేశించినట్లు తెలిసింది.

రన్నింగ్‌ రైలులో మహిళపై దారుణం:

 ఆ తర్వాత ఒంటరిగా ఉన్న మహిళను గమనించి, కత్తితో బెదిరించాడు. అతను మహిళ యొక్క హ్యాండ్‌బ్యాగ్, సెల్‌ఫోన్ లాక్కొని, ఆమె వద్ద ఉన్న డబ్బును దోచుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ చర్య అనంతరం.. ఆ దుండగుడు పెద్దకూరపాడు రైల్వే స్టేషన్ వద్ద దిగి పరారయ్యాడు.

ఇది కూడా చదవండి: కొంపముంచిన మద్యం.. రైలుకింద నలిగిపోయిన అందమైన కుటుంబం!

బాధిత మహిళ రైలులో ప్రయాణాన్ని కొనసాగించి.. చర్లపల్లికి చేరుకున్న వెంటనే నేరుగా సికింద్రాబాద్ జీఆర్పీ (GRP) పోలీసులకు ఫిర్యాదు చేసింది. రైల్వే పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి ఆచూకీ కోసం రైల్వే పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రన్నింగ్‌ ట్రైన్‌లో మహిళ భద్రతపై ఈ ఘటన మరోసారి ఆందోళన కలిగించింది.

ఇది కూడా చదవండి: రేవ్‌ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్‌ డీలర్లు

Advertisment
తాజా కథనాలు