Rohini Khadse: మగాళ్లను మర్డర్ చేసే అవకాశం ఇవ్వండి.. రాష్ట్రపతికి మహిళా నేత సంచలన లేఖ!

మగాళ్లను మర్డర్ చేసే అవకాశం ఇవ్వాలంటూ NCP SP నేత రోహిణి ఖడ్సే రాష్ట్రపతి ద్రౌపదీకి లేఖ రాశారు. మహిళలపై నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో శిక్ష లేకుండా ఈ వెసులుబాటు కల్పించాలని కోరారు. దీంతో ఆశకు హద్దుండాలంటూ ఆమెపై మగజాతి దుమ్మెత్తిపోస్తోంది. 

New Update
Rohini Khadse

Rohini Khadse Sensational letter to President Murmu

Rohini Khadse: దేశ రాజకీయాల్లో మరో దుమారం రేగింది. ఇప్పటికే క్రికెటర్ రోహిత్ శర్మ ఫిట్ నెస్‌పై నోరుపారేసుకున్న షామా మహ్మద్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా మరో మహిళా నేత మగాళ్లపై సంచలన కామెంట్స్ చేశారు. ఏకంగా పురుషులను చంపేందుకు అనుమతి కావాలంటూ శరద్ పవార్ నేతృత్వంలోని NCP SP మహిళా విభాగం ప్రెసిడెంట్ రోహిణి ఖడ్సే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాయడం సంచలనం రేపుతోంది. 

వారిని చంపాలని కోరుకుంటున్నా..

ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లేఖ రాసిన ఖడ్సే.. ఎలాంటి పనిష్మెంట్ లేకుండా ఒక మర్డర్ చేసుకునే అవకాశం మహిళలకు ఇవ్వాలని కోరారు. స్త్రీలందరి తరఫున మేం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఒక మర్డర్ చేసేందుకు మాకు ఇమ్యూనిటీ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ ఖడ్సే లేఖలో పేర్కొన్నారు. అయితే మహిళలపై నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ వెసులుబాటు కల్పించాలని ఆమె లేఖలో స్పష్టం చేశారు. సమాజంలో మహిళలను అణచివేసే మనస్తత్వం, రేపిస్ట్ మనస్తత్వం, శాంతిభద్రతలకు భంగం కలిగించే ధోరణులను కలిగివున్న వారిని చంపాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. 

Also Read: ఎలన్ మస్క్‌ను రంగంలోకి దింపిన ట్రంప్.. సునీతా విలియమ్స్‌ తీసుకొచ్చే డేట్ ఫిక్స్!

మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి. ఇటీవల ముంబైలో 12 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం జరిగింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మహిళల కిడ్నాప్, గృహహింస నేరాలు పెరుగుతుండటంతో మహిళలకు అత్యంత అసురక్షిత దేశంగా భారతదేశం ఉందని ఒక సర్వే నివేదికను కూడా ఆమె ప్రస్తావించారు. చివరగా 'మా డిమాండ్ పై ఆలోచించి మంజూరు చేస్తారని ఆశిస్తున్నాం' అని ఖడ్సే అన్నారు.

Also Read: కాలిఫోర్నియా గవర్నర్ రేసులో యూఎస్ మాజీ ఉపాధ్యక్షురాలు కమలా 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు