SLBC breaking : టన్నెల్ ప్రమాదంలో కీలక పురోగతి....కార్మికుల ఆన‌వాళ్లు గుర్తించిన కేర‌ళ జాగిలాలు

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్‌బీసీ) టన్నెల్ కూలిన ఘటనలో చిక్కుకుపోయిన వారి మృతదేహాలను కేరళ నుంచి తెప్పించిన జాగిలాలు గుర్తించినట్టు తెలిసింది. సొరంగంలో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తున్నారు. ఈ క్రమంలో గల్లంతైన వారిని గుర్తించడంలో కొంత పురోగతి కనిపించింది.

New Update
 SLBC Tunnel Collapse

SLBC Tunnel Collapse

SLBC tunnel accident : శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్‌బీసీ) టన్నెల్ కూలిన ఘటనలో చిక్కుకుపోయిన వారి మృతదేహాలను కేరళ నుంచి తెప్పించిన జాగిలాలు గుర్తించినట్టు తెలిసింది. సొరంగం కూలడంతో అందులో పేరుకుపోయిన మట్టిని జాగ్రత్తగా తొలగిస్తున్నారు. ఈ క్రమంలో గల్లంతైన వారిని గుర్తించడంలో కొంత పురోగతి కనిపించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలోని డీ-2 పాయింట్‌లో గల్లంతైన వారి ఆనవాళ్లను జాగిలాలు గుర్తించినట్టు తెలిసింది. వారిలో కొందరిని నేటి సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది.

Also Read: Syria: రెండు రోజుల్లో ఏకంగా 600మంది..సిరియాలో దాడులు

  శ్రీశైలం వ‌ద్ద ఎస్ఎల్‌బీసీ సొరంగంలో స‌హాయ‌క చ‌ర్యలు కొన‌సాగుతున్నాయి. సొరంగంలో గ‌ల్లంతైన కార్మికులు, ఇంజినీర్ల వారిని గుర్తించ‌డంలో కొంత పురోగ‌తి ల‌భించింది. ప్రమాదం జ‌రిగిన 100 మీట‌ర్ల దూరంలో డీ-2 పాయింట్‌లో కార్మికుల ఆన‌వాళ్లను కేర‌ళ జాగిలాలు గుర్తించిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మ‌ట్టిని తొల‌గిస్తున్నారు. గ‌ల్లంతైన వారిలో కొంద‌రిని నేడు సాయంత్రానికి గుర్తించే అవ‌కాశం ఉంది. ఆన‌వాళ్లు ల‌భించ‌డాన్ని అధికారులు ఇంకా ధృవీక‌రించ‌లేదు.

ఇది కూడా చూడండి: Lalith Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం..ఎంతకు కొన్నారో తెలుసా?
 
ఐదేళ్ల సుదీర్ఘకాలం తర్వాత ఇటీవల ఎస్ఎల్‌బీసీ సొరంగం పనులు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 22న ఉదయం పనులు జరుగుతుండగా టన్నెల్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ క్రమంలో టన్నెల్ బోరింగ్ యంత్రానికి ఇటువైపున ఉన్న 42 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడగా, అటువైపున చిక్కుకుపోయిన 8 మంది జాడ గల్లంతైంది. వారిని రక్షించేందుకు అప్పటి నుంచి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రోజులు గడుస్తుండటంతో లోపల చిక్కుకుపోయిన వారు మరణించి ఉంటారని భావిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: TG News: మహిళలపై సీఎం రేవంత్ వరాల జల్లు.. ఇందిరా మహిళాశక్తి మిషన్-2025 పాలసీ ప్రకటన!

ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ రెండు వారాలైనా లభించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌లో సాయం చేసేందుకు కేరళ పోలీసు శాఖకు చెందిన కడావర్‌ డాగ్స్‌ను రాష్ట్ర ప్రభు త్వం రంగంలోకి దించింది. కేరళలోని త్రిసూర్‌ నుంచి రెండు కడావర్‌ జాగిలాలతోపాటు వాటి శిక్షకుల ను గురువారం సాయంత్రానికి దోమలపెంటకు రప్పించింది.  నేషనల్‌ డిజా స్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎన్‌డీఎంఏ), కేంద్ర హోంశాఖ కార్యదర్శి కల్నల్‌ కీర్తిప్రకాశ్‌ సింగ్‌ ఆధ్వర్యంలో రెండు సైనిక హెలికాప్టర్లలో ఆ శునకాలు, శిక్షకులు వచ్చారు. ముందుగా ప్రమాదస్థలం వద్ద పరిస్థితులను పరిశీలించేందుకు కల్నల్‌ కీర్తి ప్రకాశ్‌సింగ్‌తోపాటు కేరళ పోలీసు అధికారి ప్రభాత్‌ నేతృత్వంలో కడావర్‌ డాగ్స్‌ రెస్క్యూ బృందం సొరంగంలోకి వెళ్లింది. 

ఇది కూడా చూడండి: Trolls on Jr NTR: ఎన్టీఆర్ యాడ్ పై గోరంగా ట్రోలింగ్‌..! వీడియో చూశారా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు