BIG BREAKING: గోదావరిలో 8 మంది యువకులు గల్లంతు
తూర్పు గోదావరిలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు.ఈ ఘటన ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద చోటుచేసుకుంది. పెళ్లి కోసమని వెళ్లిన 11 మంది యువకులు స్నానం కోసం గోదావరి నదిలో దిగారు.
తూర్పు గోదావరిలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు.ఈ ఘటన ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద చోటుచేసుకుంది. పెళ్లి కోసమని వెళ్లిన 11 మంది యువకులు స్నానం కోసం గోదావరి నదిలో దిగారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై లారీ వేగంగా దూసుకెళ్లి కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణ పాలయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నారాయణపూర్‌లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన కేశవరావు వరంగల్ NITలో బీటెక్ చేసి ఉద్యమంలోకి చేరారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడం, ఐఈడీ బాంబు తయారీ, పేల్చడం వంటి వాటిలో కేశవరావు దిట్ట.
పానీపూరీ, చాక్లెట్లు కొనివ్వండని ఓ ఏడేళ్ల అబ్బాయి యానం పోలీస్ స్టేషన్‌కు కాల్ చేసి అడిగాడు. ఒకసారి కాల్ చేసి అడిగితే చెప్పవద్దని పోలీసులు చెప్పినా సుమారుగా 8 సార్లు కాల్ చేసి అడిగాడు. దీంతో పోలీసులు ఆ అబ్బాయి ఇంటికి వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు.
కాకినాడ జిల్లా తునిలో విషాద ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టడంతో స్పాట్లోనే ముగ్గురు ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. రాజమండ్రి అపోలో ఫార్మసీకి చెందిన ఉద్యోగులు మృతి చెందినట్లు గుర్తించారు.
ఏలూరు జిల్లా భీమడోలు మండలం కోమటిగుంట చెరువులో ప్రమాదవశాత్తు పడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి వెలికితీశారు. ఇంకా గల్లంతైన ఇద్దరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఏపీ కాకినాడలో ఘోరం జరిగింది. రామారావుపేట కాలేజీలో కంప్యూటర్ టీచర్‌గా పనిచేస్తున్న వివాహిత.. స్టూడెంట్ మణికంఠతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమె భర్త లక్ష్మణ్ పక్కా సమాచారంతో వారు ఇంట్లో సన్నిహితంగా ఉండగా పోలీసులతో కలిసి పట్టుకుని చితకబాదాడు.
ఏపీలో రెండో పెళ్లికి అడ్డుగా ఉందని ఐదు నెలల పసిపాపను చంపేసిన దారుణ ఘటన జరిగింది. శైలజ అనే యువతి రెండేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. ఇది నచ్చక తల్లి ఆమె మనస్సును మార్చి రెండో పెళ్లికి సిద్ధం చేసింది. ఈ పసి పాప అడ్డుగా ఉందని గొంతు నులిమి చంపేశారు.
అల్లూరి జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు బావమరుదులను ఒక బావ శూలంతో పొడిచి హతమార్చాడు. కాపాడబోయిన మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ దారుణానికి కారణం భార్యాభర్తల మధ్య గొడవ అని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.