/rtv/media/media_files/2025/05/28/UhpZva5w6wRAZFJbhyBH.jpg)
Godavari River three students missing and two Dead bodies found
బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నిన్న ఘోరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. కె.గంగవరం మండలం శేరిలంక వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగి దాదాపు 7 మంది మృతి చెందారు. అందులో ఒకరు గల్లంతయ్యారు. ఈ విషాదకర ఘటన మరువక ముందే మరోకటి జరిగింది.
ALSO READ: ఈసారి ఆర్సీబీ కప్ గెలుస్తుందా? చాట్‌జీపీటీ ఆన్సర్‌కు ఫ్యాన్స్ అవాక్!
పి.గన్నవరం మండలం నాగుల్లంకకు సమీపంలో వశిష్ట గోదావరిలో స్నానానికి దిగి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. నాగుల్లంకకు చెందిన కేతా ప్రవీణ్(16), సానబోయిన సూర్యతేజ (12), వెస్ట్ గోదావరి జిల్లా యలమంచిలి మండలం పెదలంకకు చెందిన నీతిపూడి పౌల్‌కుమార్(15) గల్లంతయ్యారు.
ALSO READ: స్టూడెంట్స్ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న ట్రంప్..వీసా ఇంటర్వ్యూలు నిలిపేయాలని ఆదేశం
రెండు డెడ్‌బాడీలు లభ్యం
నాగుల్లంక నుంచి మొత్తం 5గురు విద్యార్థులు గోదావరిలో స్నానాలకు వచ్చారు. వీరిలో ముగ్గురు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. మిగిలిన ఇద్దరు భయంతో పరుగులు తీసి.. సమాచారాన్ని సమీప స్థానికులకు తెలియజేశారు. ఇక గల్లంతైన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు తాజాగా లభ్యమయ్యాయి. గల్లంతైన వారిలో ప్రవీణ్ (16), సూర్యతేజ(12) డెడ్‌బాడీస్ దొరికాయి. మరో వ్యక్తి పౌల్‌కుమార్(15) కోసం NCDRF, రెవెన్యూ అధికారులు గాలిస్తున్నారు.
ALSO READ: 5వ తరం జెట్ ను అభివృద్ధి చేస్తున్న ఇండియా
8 మంది గల్లంతు
తూర్పు గోదావరిలో(Godavari) విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు.ఈ ఘటన ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద చోటుచేసుకుంది. పెళ్లి కోసమని వెళ్లిన 11 మంది యువకులు స్నానం కోసం గోదావరి నదిలో దిగారు. లోతైన ప్రాంతం కావడంతో 8 మంది గల్లంతుకాగా మరో ముగ్గురు సురక్షితంగా బయటకు వచ్చారు. గల్లంతైన వారు క్రాంతి, పాల్, సాయి, మహేష్, సతీష్, మహేష్, రాజేష్, రోహిత్ లుగా గుర్తించారు. గల్లంతైన యువకుల కోసం పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు.