/rtv/media/media_files/2025/05/17/yicrN6KNOVt08ttaR06i.jpg)
Kid called the police for panipuri
Kid Calls Police for Panipuri: పోలీస్ స్టేషన్‌కు కాల్ చేసి ఎవరైనా కూడా ఫిర్యాదు చేస్తారు. కానీ ఓ బుడ్డోడు మాత్రం పోలీసులకు కాల్ చేసి చుక్కలు చూపించాడు. వివరాల్లోకి వెళ్తే.. యానాం పోలీస్ స్టేషన్‌కు కొన్ని రోజుల కింద ఓ కాల్ వచ్చింది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయగా ఫస్ట్ ఎవరూ మాట్లాడలేదు. ఫిర్యాదు కోసమైతే వారే చేస్తారని పోలీసులు వదిలేశారు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ కాల్ వచ్చింది.
ఇది కూడా చూడండి:RCB VS KKR: జోష్ మళ్ళీ మొదలు..ఈరోజు నుంచి ఐపీఎల్ రీస్టార్ట్
ఇలా కాల్ చేయకూడదని చెప్పినా..
ఓ చిన్న పిల్లాడు నాకు పానీపూరీ, చాక్లెట్లు కొనివ్వండని అడిగాడు. తెలియక పిల్లాడు చేశాడని పోలీసులు లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత కూడా మళ్లీ కాల్ చేసి చాక్లెట్లు కావాలని అడిగారు. పోలీసులు ఇలా కాల్ చేయకూడదని చెప్పారు. ఇక ఆ పిల్లాడు కాల్ చేయడని పోలీసులు భావించారు. కానీ అలా చెప్పిన తర్వాత కూడా పలు మార్లు కాల్ చేసి చాక్లెట్లు, పానీపూరీ కొనివ్వమని అడిగాడు. దీంతో పోలీసులు వారి అడ్రస్ కనుక్కుని ఇంటికి వెళ్లారు.
ఇది కూడా చూడండి:Oppo Reno 14 5G Series: కిర్రాక్ మావా.. అప్పు చేసైనా ఒప్పో కొనేయాల్సిందే - ఫోన్లు అదిరిపోయాయ్!
తల్లి ఫోన్‌తో గేమ్స్ ఆడుతూ కాల్ చేశాడని పోలీసులు గుర్తించారు. ఇకపై కాల్స్ చేయవద్దని పిల్లాడితో పాటు తల్లికి కూడా చెప్పారు. అలాగే పిల్లాడికి కావాల్సిన వాటిని కూడా కొనివ్వమని పోలీసులు తెలిపారు.