East Godavari: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్.. ఎక్కడంటే?

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై లారీ వేగంగా దూసుకెళ్లి కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణ పాలయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
East Godavari Crime News

East Godavari Crime News

AP Crime: తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. స్థానిక సమాచారం ప్రకారం.. దివాన్ చెరువు నుంచి గామన్ బ్రిడ్జి వైపు వెళ్లే రహదారిపై వేగంగా దూసుకువచ్చిన లారీ ఒక్కసారిగా అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది.  లారీ దాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనకు లారీ టైరు పేలిపోవడమే కారణమని ప్రాథమికంగా గుర్తిస్తున్నారు. టైరు విఫలమైన వెంటనే లారీ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.

Also Read :  ఆ దేశ అధినేత పిచ్చొడు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ప్రాణాలు తీసిన లారీ..

ప్రమాదం తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అక్కడికక్కడే రెస్క్యూ కార్యకలాపాలు ప్రారంభించాయి. అందులో ముగ్గురు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. అందులో ఒకరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అతని పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో రాజానగరం ప్రాంతమంతా విషాదఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  మేడ్చల్‌లో విషాదం.. కరెంట్ వైర్ ప్రమాదంలో యువతి మృతి

ప్రమాదం జరిగిందన్న సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ నర్సింహా కీషోర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆయన  ప్రమాదం జరిగే పరిస్థితులను పూర్తిగా విచారించి తగిన చర్యలు తీసుకుంటామని బాధితుల కుటుంబాలకు తెలిపారు. స్థానికుల కథనం మేరకు లారీ నిర్లక్ష్యం, అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమయ్యే అవకాశముందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు ఒక్కసారి ప్రాణాలు కోల్పోవటంతో బాధిత కుటుంబాలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. 

ఇది కూడా చదవండి: తిన్న తర్వాత ఈ ఐదు సమస్యలు ఉంటే ఆరోగ్యం క్షీణిస్తోందని అర్థం

Also Read :  మత్తు కళ్లతో పిచ్చెక్కిస్తున్న కేతిక.. ఒక్క చూపుకే కుర్రాళ్లు ఫిదా

( ap crime updates | ap-crime-news | ap crime latest updates | AP Crime | latest-news | telugu-news)

Advertisment
Advertisment
తాజా కథనాలు