Pawan kalyan: డిప్యూటీ సీఎం ఇలాకాలో తప్పని వరద కష్టాలు.. పడవలపై ప్రమాదకరంగా..
పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలకు వరద కష్టాలు తప్పడం లేదు. గొల్లప్రోలులోని శుద్ధ గడ్డ వాగు మళ్లీ పొంగిపొర్లడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ పిల్లలు, కాలనీవాసులు లైఫ్ జాకెట్ లేకుండా పడవలపై ప్రమాదకరంగా ప్రయాణాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.