సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై పవన్ షాకింగ్ కామెంట్స్!

AP: లడ్డూ కల్తీ కేసుపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. లడ్డూలో కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదని అన్నారు. తిరుమలలో గత ఐదేళ్లుగా జరిగిన అక్రమాలపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోందని అన్నారు.

New Update
PAWAN KA

Pawan Kalyan: ప్రాయశ్చిత్త దీక్షపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ప్రాయశ్చిత్త దీక్ష కేవలం లడ్డూ కోసం కాదని అన్నారు. లడ్డూ అనేది ట్రిగ్గరింగ్ ఇష్యూ మాత్రమే అని అన్నారు. సనాతన పరిరక్షణ బోర్డు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. రామతీర్థంలో రాముడి తల నరికారని.. కొన్నేళ్లుగా 219 టెంపుల్స్ ధ్వంసం చేశారని మండిపడ్డారు.

సుప్రీం కోర్టు అలా చెప్పలేదు...

లడ్డూ కల్తీ కేసుపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ తొలిసారి స్పందించారు. లడ్డూలో కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదని అన్నారు. తేదీల విషయంలో గందరగోళం ఉందని అన్నారని.. వారి దగ్గర ఉన్న సమాచారం మేరకే సుప్రీంకోర్టు స్పందించిందని చెప్పారు. ఈ విషయాన్ని మా ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని అన్నారు. ఇది కేవలం లడ్డూకు సంబంధించిన విషయం మాత్రమే కాదని.. గత ఐదేళ్లలో జరిగిన ఉల్లంఘనల గురించి కూడా అని ఆయన అన్నారు.

సుప్రీం కోర్టు ఏమంది?.. 

శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న అంశంపై సుప్రీంకోర్టులో జస్టిస్ బి.ఆర్.గవాయ్‌, కె.వి.విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న కామెంట్స్‌పై సుప్రీం సీరియస్ అయింది. టెస్టులకు పంపిన నెయ్యి లడ్డూల తయారీలో వాడలేదని ప్రాథమిక ఆధారాలున్నాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి వాడారని సీఎం బహిరంగ ప్రకటన చేశారని.. మరోవైపు కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పినట్లు వార్తలు వచ్చినట్లు చెప్పింది.

మధ్యలో దేవుళ్ళు ఎందుకు?...

దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు తెలిపింది. ల్యాబ్ రిపోర్టులో కొన్ని డిస్‌క్లెయిమర్స్ ఉన్నాయని పేర్కొంది. విచారణకు ఆదేశించిన తర్వాత మీడియా ముందు కామెంట్స్ ఎలా చేస్తారు అని ప్రశ్నించింది. మీకు జూలైలోనే రిపోర్టులు వచ్చాయని.. సెప్టెంబర్‌ 18న పబ్లిక్‌గా ఆరోపణలు చేశారని జస్టిస్ విశ్వనాథన్ అన్నారు. కచ్చితమైన ఆధారాలు లేనప్పుడు ఆరోపణలు ఎలా చేస్తారు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు