AP: ఏపీ పై అల్పపీడనం ప్రభావం..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో.. నేడు కోస్తా ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. By Bhavana 25 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి AP: ఏపీలో గత రెండు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో నేడు కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. అయితే కోస్తా జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం లేదని సమాచారం. ఇవాళ అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నాయి. తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో నేడు రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నేడు మెదక్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉంటాయంటున్నారు. సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి