Ap Road Accident: ఏపీలో వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి! ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ప్రమాదాల్లో 9 మంది చనిపోయారు. అనంతపురంలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, కాకినాడలో ఇద్దరు చనిపోయారు. By Bhavana 22 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Ap Road Accident: ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో సుమారు 9 మంది చనిపోయారు. అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట దగ్గర నార్పలవైపు వెళ్తున్న కారును లారీ ఢీ కొట్టడంతో.. స్పాట్ లోనే నలుగురు మృతి చెందారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు మొదలు పెట్టారు. జాతీయ రహదారిపై... మృతులు అందరూ అనంతపురంలోని సిండికేట్‌నగర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, తిరుపతి జిల్లా చిల్లకూరు సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు నగరం వనంతోపు ప్రాంతానికి చెందిన భక్తులు తమిళనాడులోని అరుణాచలంకు వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా.. ముందు వెళ్తున్న కంటైనర్ ను వేగంగా వీరు ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు-బైక్ ఢీ... ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు.. గాయపడిన వారిని గూడూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే కాకినాడ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. చనిపోయిన వారిని విజయవాడకు చెందిన నిరంజన్, భీమవరానికి చెందిన రేవంత్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పరీక్ష రాసేందుకు... విజయవాడ కేఎల్ వర్సిటీలో బీబీఏ చదువుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పరీక్ష రాసేందుకు విశాఖకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి