/rtv/media/media_files/tD57iRZeD8cnYxCzfqxH.jpg)
Vijayabharathi : ప్రముఖ రచయిత్రి బి.విజయభారతి మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానూభూతి తెలిపారు. పౌర హక్కుల నేత బొజ్జా తారకం సతీమణి విజయభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా సాహితీ రంగంలో ఆమె సేవలు అపారమైనవంటూ సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా విజయభారతికి నివాళి అర్పించారు.
విజయభారతి సేవలు మరవలేనివి..
'తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా విజయభారతి అందించిన సేవలు మరవలేనివి. ప్రాచీన సాహిత్య కోశం, ఆధునిక సాహిత్య కోశం ఆమె వెలువరించారు. సాహితీ రంగానికి ఆమె చేసిన సేవలు అపారమైనవి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి' అంటూ ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రముఖ హేతువాది, దళిత నాయకుడు, న్యాయవాది బొజ్జా తారకంను విజయభారతి 1968లో పెళ్లి చేసుకున్నారు. బొజ్జా తారకం, విజయభారతి దంపతుల కుమారుడు రాహుల్ బొజ్జా.. ఆయన ప్రస్తుతం తెలంగాణ కేడర్‌లో ఐఏఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ సైతం విజయ భారతికి నివాళి అర్పించింది.
డాక్టర్ విజయభారతి గారికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి.
— BRS Party (@BRSparty) September 28, 2024
సుప్రసిద్ధ కవయిత్రి, రచయిత్రి, అనువాదకురాలు, అంబేడ్కరిస్ట్ డా. విజయభారతి గారి మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సాహిత్య, సామాజిక అధ్యయనశీలిగా విశ్లేషకురాలిగా డాక్టర్ విజయభారతి గారు చేసిన కృషిని… pic.twitter.com/rApqh0k86I
Also Read : హైడ్రాకు బిగ్ షాక్.. కేసు నమోదు