Cheetah : చిక్కని చిరుత.. రాజమండ్రిలో టెన్షన్.. టెన్షన్!

రాజమండ్రిలో 25 రోజులుగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత ఇంకా చిక్కలేదు. రెండ్రోజులుగా చిరుత ఆనవాళ్లు ఎక్కడా దొరకలేదని, వర్షం వల్ల చిరుత పాదముద్రలు కనిపించడం లేదని DFO ప్రసాదరావు వెల్లడించారు. చిరుతను త్వరగా పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

author-image
By Vijaya Nimma
New Update

Cheetah Operation: రాజమండ్రి రూరల్‌లో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. ఎడతెరపిలేని వర్షం కారణంగా చిరుత ఆనవాళ్లను అధికారులు గుర్తించలేకపోతున్నారు. ఇప్పటికే చిరుత కోసం నాలుగు బోన్లు, 40 ట్రాప్‌ కెమెరాలు, 4 సోలార్‌ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 10 బృందాలతో సెర్చ్‌ ఆపరేషన్‌ జరుపుతున్నారు. అయితే చిరుత గోదావరి లంక వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. మూడు రోజులుగా చిరుత ఆనవాళ్లు ఎక్కడా దొరకలేదని, చిరుత జనావాసాల్లోకి వెళ్తే మత్తు ఇంజెక్షన్‌ షూట్‌ చేసేందుకు బృందాలు రెడీగా ఉన్నాయని డీఎఫ్‌వో చెబుతున్నారు.

చిరుత కనిపిస్తే చేతులు పైకెత్తి.. అరుస్తూ వెనక్కి నడవాలి:

కేశవరం, మండపేటలో ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదని, సోషల్‌ మీడియాలో చిరుత సంచారంపై తప్పుడు ప్రచారం చేయొద్దని సూచిస్తున్నారు. ఒక వేళ ప్రజలకు చిరుత కనిపిస్తే చేతులు పైకెత్తి, అరుస్తూ వెనక్కి నడవాలని, అప్పుడు అది ఏదో పెద్ద జంతువుగా భావించి దాడి చేయలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలో గత 25 రోజులుగా చిరుత కోసం సెర్చింగ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఎప్పుడు ఇళ్ల వైపు వస్తుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Also Read :  నందిని నెయ్యితో తిరుపతి లడ్డూ.. ఈ బ్రాండ్ ప్రత్యేకత ఇదే!


Advertisment
Advertisment
తాజా కథనాలు