/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ap-govt-jpg.webp)
AP Govt
ఏపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రహ్మణులకు శుభవార్త చెప్పింది.. జీతాల పెంపు విషయంలో దేవాదాయ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల కేశఖండనశాలల్లో విధులు నిర్వర్తించే నాయీబ్రాహ్మణులకు కనీస కమీషన్‌ను పెంచారు. గతంలో నెలకు రూ.20వేల వరకు ఉండగా.. ఇప్పుడు దానిని నెలకు రూ.25 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
Also Read: Air India: పహల్గాం ఉగ్రదాడి...కీలక ప్రకటన చేసిన ఇండిగో,ఎయిర్ ఇండియా!
రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రహ్మణులకు ఇప్పటి వరకు కనీస కమీషన్ రూ.20 వేలు ఉండగా.. దాన్ని మరో రూ.5 వేలు పెంచుతామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. ఇటీవల దేవాదాయ శాఖపై సమీక్ష చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ హామీని అమలు చేయాలని ఆదేశించారు.
Also Read: Hyderabad Metro: వివాదంలో హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం
ఈ క్రమంలో దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 100 రోజులకుపైగా కేశఖండన విధులుండే 44 ప్రధాన ఆలయాల్లోని నాయీబ్రాహ్మణులకు కమీషన్ రూ.25 వేలుకు పెంచుతూ దేవాదాయశాఖ ఇంఛార్జ్ ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు ప్రభుత్వం కనీస మొత్తంగా 25 వేల రూపాయల భృతిని నాయీ బ్రాహ్మణులకు అందేలా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ‘6ఏ’ కింద దాదాపు 175 ఆలయాలు ఉండగా.. అందులో 44 ఆలయాల్లో మాత్రమే భక్తులు నిత్యం తలనీలాలు ఇస్తుంటారు. తమ కమిషన్‌ను రూ.20వేల నుంచి రూ.25వేలకు పెంచడంపై నాయీ బ్రాహ్మణులు ఆనందం వ్యక్తం చేశారు.
Also Read:TTD:తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఉచితంగానే..!
Also Read: Israel: పాక్ ను సర్వనాశనం చేద్దాం...రంగంలోకి ఇజ్రాయెల్
ap | temples | nayee brahmins | salaries | hike | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | ap-news