పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రేరేపించడం వల్లనే జరిగిందని వార్తలు వచ్చాయి. పాక్ ఆర్మీ ఛీప్ మునీర్ వ్యాఖ్యల వల్లనే లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ అటాక్ కు పాల్పడిందని తెలుస్తోంది. అటాక్ జరిగిన పాకిస్తాన్ ప్రవర్తన కూడా అనుమానాసకపదంగానే ఉంది. దాడిపై ఇప్పటి వరకు ఆ దేశం కనీసం స్పందించలేదు. దానికి తోడు ఆ దేశ రక్షణ మంత్రి ఇదంతా భారతే చేసుకుంది అంటూ పిచ్చ ప్రేలాపన పేలారు. పాక్ ప్రధాని కాశ్మీర్ దాడి గురించి ఏ రకంగానూ మాట్లాడలేదు. ప్రపంచ దేశాలన్నీ భారత్ కు మద్దుతు ఇస్తున్నాయి. పాక్ నేు తిడుతున్నాయి. కానీ తాము కాదని కనీసం డిఫెన్స్ కూడా చేసుకోవడం లేదు. ఏదో నామ్ కే వాస్తే దాడి తామే చేసినట్లు ఆరోపణలు చూపించండి అంటున్నారు కానీ పక్క నుంచి చేయవల్సిన పనులన్నీ చేస్తోంది.
ఇజ్రాయెల్ మద్దతు..
దీంతో పాక్ పై అన్ని విధాలా దాడులు ప్రారంభించింది భారత్. దౌత్యపరమైన సంబంధాలను తెగ్గొట్టుకుంది. దానికి ప్రతిగా పాకిస్తాన్ కూడా అవే చర్యలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాధినేతలు అందరూ ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా కాల్ చేశారని తెలుస్తోంది. తమ పూర్తి మద్దతు భారత్ కే ఉంటుందని...పాక్ ను లేపేద్దామని చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే అమెరికా, రష్యా వంటి దేశాలు భారత్ కు మద్దతును ప్రకటించాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఇజ్రాయెల్ కూడా చేరింది.
today-latest-news-in-telugu | india | israel | war | Pahalgam attack