/rtv/media/media_files/2025/02/15/TZuE8wCRjwBcb1wsufaV.jpg)
accident
Road Accident: ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్ల వారి మిట్ట జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ రోజు ఉదయం విజయవాడ నుంచి బెంగుళూరు(bengalore)కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయలయ్యాయి. - అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులతోపాటు 108కి సమాచారం అందించారు.
Also Read : 12 ఏళ్ల బాలికను రేప్ చేసిన భూతవైద్యుడు.. తల్లిదండ్రులు ఉండగానే - ఛీఛీ
Private Travels Bus Accident At Nellore
క్షతగాత్రులను 108 వాహనంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఎస్ ఐ నాగరాజు- సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆసుపత్రి వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు.- డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందంటున్న ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారని ఎస్ఐ నాగరాజు చెప్పారు. ఈ బస్సులోని ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఈ బస్సు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు.
Also Read : భార్య, పిల్లల్ని చంపిన హత్య కేసు.. దోషికి ఉరిశిక్ష
Follow Us