/rtv/media/media_files/2025/11/20/uttar-pradesh-jhansi-12-year-old-girl-2025-11-20-21-11-56.jpg)
Uttar Pradesh Jhansi 12 year old girl
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. బారుసాగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో, భూతవైద్యం చేసే నెపంతో ఒక తాంత్రికుడు 12 ఏళ్ల బాలికపై మూసి ఉన్న గదిలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
భూతవైద్యం నెపంతో బాలికపై రేప్
12 ఏళ్ల బాలిక కొన్ని రోజులుగా గొంతు నొప్పితో బాధపడుతోంది. కనీసం భోజనం కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. తల్లిదండ్రులు హాస్పిటల్‌కు కూడా తీసుకెళ్లారు. కానీ ఎలాంటి ఉపశమనం లభించలేదు. దీంతో ఏదో మంత్రం వల్లే గొంతునొప్పి వస్తుందని కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు అనుకున్నారు. వెంటనే మధ్యప్రదేశ్‌లోని నివారీలోని సినౌనియా గ్రామానికి చెందిన హర్భజన్ అనే వ్యక్తి భూతవైద్యం చేస్తున్నాడని ఆ కుటుంబం తెలుసుకుంది.
దీంతో నవంబర్ 18న అతన్ని ఇంటికి పిలిపించారు. ఆ బాలికను చూడగానే, ఆమెకు దెయ్యం పట్టిందని, ఆ కర్మను ఏకాంతంగా నిర్వహిస్తామని చెప్పాడు. ఆ బాలిక ఏడ్చినా ఎవరూ లోపలికి రాకూడదని అతను ముందుగానే స్పష్టంగా చెప్పాడు. దెయ్యాన్ని వదిలిస్తానని చెప్పి ఆ బాలిక తల్లిదండ్రులను నమ్మించాడు. ఆ తర్వాత ఆ తాంత్రికుడు ఆ బాలికను ఒక గదిలోకి తీసుకెళ్లాడు.
కొంతసేపటి తర్వాత ఆ బాలిక ఏడవడం ప్రారంభించింది. కానీ అతను ముందుగానే చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు లోపలికి వెళ్లలేదు. దాదాపు అరగంట తర్వాత అతను బయటకు వచ్చి ఆచారం పూర్తయిందని, అమ్మాయి ఇప్పుడు ఉపశమనం పొందుతుందని చెప్పి వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోయిన తర్వాత.. ఆ బాలిక తన తల్లిని హత్తుకుని ఏడుస్తూ, తనకు ఎదురైన బాధను వివరించింది.
తాంత్రికుడు తన బట్టలు విప్పించి, తన శరీరంపై నిమ్మకాయ రుద్దాడని, అసభ్యకరమైన పనులు చేశాడని ఆమె చెప్పింది. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వెంటనే భయపడి వారు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా నిందితుడు హర్భజన్ పై 75(2), 7, 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలోనే అతన్ని అరెస్టు చేస్తామని తెలిపారు.
Follow Us