/rtv/media/media_files/2025/05/03/lxATJGfjVmhJfbyq7g7D.jpg)
milk
Milk: పాలు మనం రోజూ తీసుకునే ముఖ్యమైన సంపూర్ణ పోషకాహారాల్లో ఒకటి. ఇందులో శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. పాలలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ముఖ్యంగా కాల్షియం, విటమిన్ డి ఉండటంతో చిన్నారుల నుంచి వృద్ధుల దాకా అందరికీ ఉపయోగకరం. మితిమీరి తీసుకుంటే వచ్చే సమస్యలేంటి అనేది చాలా మందికి తెలియదు. చాలా మంది మంచి ఆరోగ్యం కోసం రోజుకు లీటర్ పాలు తాగడం అలవాటుగా మార్చుకున్నారు. కానీ ఇది శరీరానికి మేలు కంటే హానికరంగా మారవచ్చు.
గుండెకు ఒత్తిడి పెరుగుతుంది:
ముఖ్యంగా పాల వంటి జంతు సంబంధ ఆహారాల్లో ఉండే ప్రొటీన్లు అధిక మోతాదులో తీసుకుంటే కొన్ని ప్రమాదాలు ఉంటాయి. జంతు సంబంధ ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి వ్యాధులకు అవకాశం పెరుగుతుంది. పైగా ఈ ఆహారాల్లో కొవ్వుల పరిమాణం కూడా ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంది. వీటిని అధిక మోతాదులో తీసుకుంటే శరీరానికి అవసరమైన శక్తికంటే మిగిలిన భాగం కొవ్వుగా మారుతుంది. దీని వల్ల రక్తనాళాలు గడ్డగడతాయి. గుండెకు ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాదు శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడే అవకాశం కూడా ఉంది.
ఇది కూడా చదవండి: ఆహారం సరిగ్గా జీర్ణం కావాలంటే ఇలా చేయండి
అందుకే పాలను మితంగా తాగాలి. రోజుకు 200 మిల్లీ లీటర్లు సరిపోతాయని నిపుణులు అంటున్నారు. అలాగే గుడ్డు ఒక్కటే సరిపోతుంది. మాంసాహారం తీసుకుంటే 75 గ్రాములలోపు మోతాదులో ఉండాలి. వీటి బదులు ఎక్కువగా వృక్ష సంబంధ ఆహారాలు తీసుకుంటే శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, మినరల్స్, ఫైబర్ వంటి పదార్థాలు అందుతాయి. పప్పులు, బీన్స్, మొలకెత్తిన ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటివి మంచి ప్రత్యామ్నాయాలు. ఈ రకమైన ఆహారం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. కాబట్టి పాల వంటివి తినడం తప్పుకాదు, కానీ వాటిని తగిన పరిమితిలోనే తీసుకోవడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: మెంతుల ఫేస్ ప్యాక్‌తో ముఖం మెరవడం ఖాయం.. ఇలా చేసుకోండి
( latest-news | best-health-tips | latest health tips | health tips in telugu )