/rtv/media/media_files/2025/05/03/YcwvulDstWqqGogsOQ3P.jpg)
Spice
Spice: వేసవి కాలంలో వాతావరణం వేడిగా మారుతుంది. ఈ కాలంలో శరీరానికి చల్లదనంతో పాటు సరైన ఆహారం అవసరం. అయితే చాలామంది వేసవిలో కూడా మసాలా దినుసులను ఉపయోగిస్తారు. లవంగాలు, దాల్చిన చెక్క, బే ఆకులు, నల్ల మిరియాలు వంటి ఘాటైన సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా వాడటం ఆరోగ్యానికి హానికరం. ఇవి శరీరంలో వేడిని పెంచడమే కాకుండా ఆమ్లతను కూడా పెంచుతాయి. వేసవిలో శరీరం సహజంగా వేడిగా మారుతుంది. ఈ మసాలాలను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా తలనొప్పి, డీహైడ్రేషన్, గ్యాస్ట్రిక్ ఇబ్బందులు, వాంతులు, చర్మ అలెర్జీలు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
కడుపు ఉబ్బరం సమస్యలు:
లవంగం రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. కానీ వేసవిలో అధికంగా తీసుకుంటే తలనొప్పి, అజీర్ణం లాంటి సమస్యలు కలుగుతాయి. అలాగే నల్ల మిరియాలు శరీర వేడిని పెంచుతాయి. ఇది చర్మ సమస్యలకు దారితీయవచ్చు. వేసవిలో ఎక్కువగా తీసుకుంటే డీహైడ్రేషన్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. దాల్చిన చెక్క యాంటీ ఆక్సిడెంట్లతో సంవృద్ధిగా ఉన్నా వేసవిలో ఇది శరీరంలో వేడి కలిగిస్తుంది. ఇది వాంతులు లేదా అసిడిటీకి కారణమవుతుంది. అలాగే జాజికాయ రుచికి ఎంతో ఉపయోగపడుతుంది కానీ వేసవిలో అధికంగా తీసుకుంటే తల తిరగడం లేదా అలసట ఏర్పడుతుంది.
ఇది కూడా చదవండి: పాలు, గుడ్లు ఒకేసారి తీసుకుంటే ఏమౌతుంది?
ఇంగువ కూడా జీర్ణశక్తిని పెంచుతుంది కానీ వేసవిలో ఎక్కువగా వాడితే గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు కలుగుతాయి. వేసవి కాలంలో కారంగా ఉండే పదార్థాలను తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచే పదార్థాలను ఆహారంలో చేర్చడం ఉత్తమం. సోంపు, కొత్తిమీర పొడి, పచ్చి ఏలకులు వంటి వాటిని వాడటం మంచిది. అలాగే పెరుగు, నిమ్మకాయ, దోసకాయ, పుదీనా వంటి పదార్థాలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. మసాలా పదార్థాలను తక్కువగా వాడటం వల్ల వేడి సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ వేసవిలో రుచి కంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి, శరీరానికి తేలికగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: కరివేపాకును తీసి పడేయకండి..దాని టీతో ఎన్నో లాభాలు
( spices | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news )
Follow Us