Why BCCI Make changes in the T20 Team: భారత క్రికెట్ టీమ్ విజయ యాత్రకు బ్రేక్ పడినట్లేనా.. వన్డే సిరీస్‌లో రాణిస్తోన్న ఆటగాళ్లు టీ20లో ఎందుకని రాణించలేకపోతున్నారు. వెస్టిండీస్ టూర్‌లో భాగంగా సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి వెనుక రహస్యమేంటి..? భారత రేసుగుర్రం జస్పిత్ బుమ్రా(Burmrah) క్రికెట్‌కు దూరమైనట్లేనా.. టీమిండియా సీనియర్ పేసర్లు భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ ఎందుకు రాణంచలేకపోతున్నారు. భారత వర్డల్ కప్ జట్టు ఎలా ఉండబోతోంది. భారత ప్లేయర్లకు ఆసియా కప్పే ఆకరి పరీక్ష అని చెప్పుకోవచ్చా..?
ఇటీవల వెస్టిండీస్ టూర్‌కు వెళ్లిన భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) నాయకత్వంలో టెస్ట్, వన్డే సీరీస్‌లను కైవసం చేసుకుంది. మొదట టెస్ట్ సిరీస్‌ను 2-0 తేడాతో వైట్ వాష్ చేసిన భారత జట్టు.. అనంతరం జరిగిన మూడు వన్డేల సిరీస్ ఆడిన టీమ్ ఇండియా.. 2-1 తేడాతో వన్డే ట్రోఫీని చేజిక్కించుకుంది. ప్రస్తుతం టీమిండియా విండీస్‌తో టీ20 సిరీస్‌లో తడపడుతోంది. ఇందులో భాగంగా.. గురువారం జరిగిన మొదటి మ్యాచ్‌లో యువ భారత్ అనూహ్యంగా ఓటమిపాలైంది. 150 పరుగుల టార్గెట్‌ను సైతం చేధించలేక చాపచుట్టేసింది. దీంతో యువ భారత జట్టుతో పాటు సెలక్టర్లపై మాజీలు విమర్శలు చేస్తున్నారు. బీసీసీఐ విండీస్‌లో జరుగుతున్న టీ20 సిరీస్‌లో విదేశాల్లో అనుభవం లేని ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడంపై మండిపడుతున్నారు.
సెలక్టర్లు టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన టీమ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తున్నారు. వీరితోపాటు భారత సీనియర్ బౌలర్లను ఎంపిక చేయకపోవడంపై సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలక్టర్లు భారత జట్టును మళ్లీ పాతాళానికి తొక్కాలని చూస్తున్నారా..? అని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు బుమ్రాను జట్టులోకి ఎందుకు తీసుకోవడంలేదని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సెలక్టర్లను ప్రశ్నించారు. బుమ్రా క్రికెట్ ప్రస్థానం ముగిసినట్లేనా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ విండీస్ టూర్‌లో ఫామ్ అందుకున్నాడని.. అతని ఫామ్ కొనసాగాలంటే విండీస్‌తో జరుగుతున్న పొట్టి ఫార్మాట్‌లో కొనసాగిస్తే బాగుండేదన్నారు.
మరోవైపు వరల్డ్ కప్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన ఆటగాళ్లను వన్డే ఫార్మాట్‌లోనే కొనసాగిస్తే మంచిదనే ఆలోచనతో బీసీసీఐ వెళ్తోందని పలువురు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ఉపఖండ వేదికల్లో జరుగనుంది. దీనిని పాక్, శ్రీలంక దేశాలు నిర్వహించనుండగా.. టీమిండియా శ్రీలంక గ్రౌడ్లో మ్యాచ్‌లు ఆడనుంది. ఆసియా కప్ టోర్నీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో నిర్వహించనుంది. టీ20 క్రికెట్ ఆడితే ప్లేయర్లు లయతప్పుతారని భావించిన బీసీసీఐ.. సీనియర్ ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, షమితో పాటు మరికొందరు ప్రధాన ఆటగాళ్లను కావాలనే పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉంచుతున్నట్లు తెలిపారు. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ కోసం విరిని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న 5 టీ20 సిరీస్ హార్డిక్ పాండ్య నాయత్వంతో టీమిండియా 1-0తో వెనుకంజలో ఉంది.
Also Read: కోకాపేట తరహాలోనే బుద్వేల్ భూముల వేలం.. ఎకరం కనీసం రూ.20కోట్లు