Mosquito Drone: అమెరికాకు ఇక చుక్కలే.. దోమ సైజులో చైనా డ్రోన్.. వీడియో చూస్తే షాక్ అవుతారు!

సైనిక కార్యకలాపాలను రహస్యంగా కనిపెట్టేందుకు చైనాలోని నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ డిఫెన్స్‌ టెక్నాలజీకు చెందిన ఓ రోబోటిక్స్‌ ప్రయోగశాల దోమ సైజ్‌లో ఓ బుల్లి డ్రోన్‌ను తయారుచేసింది. ఆ డ్రోన్ గురించి ఎన్‌యూడీటీ విద్యార్థి టీవీ వీక్షకులకు వివరించారు.

author-image
By K Mohan
New Update
china mosquito drone

డ్రాగన్ కంట్రీ ఓ అద్భుత పరికరాన్ని కనిపెట్టింది. శత్రు దేశాలపై నిఘా పెట్టడానికి ఓ అరుదైన డ్రోన్ కనిపెట్టింది. సైనిక కార్యకలాపాలను రహస్యంగా కనిపెట్టేందుకు చైనాలోని నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ డిఫెన్స్‌ టెక్నాలజీకు చెందిన ఓ రోబోటిక్స్‌ ప్రయోగశాల దోమ సైజ్‌లో ఓ బుల్లి డ్రోన్‌ను తయారుచేసింది. హ్యుమనాయిడ్‌ మిషన్ల నుంచి కంటికి కనిపించనంత పరిమాణంలోని సూక్ష్మ డ్రోన్ల వరకు ప్రయోగశాలలో వారు తయారుచేసిన రోబోలను ఎన్‌యూడీటీ పరిశోధకులు చైనా సెంట్రల్‌ టెలివిజన్‌కు చెందిన సైనిక చానల్‌లో గత వారాంతంలో ప్రదర్శించారు. వాటిలో దోమ సైజులో, అలాగే అదే ఆకారంలో ఉన్న ఓ డ్రోన్ ఆకర్షణగా నిలిచింది.

Also Read :  ఇజ్రాయెల్‌ దాడుల్లో ముగ్గురు కీలక ఐఆర్‌జీసీ కమాండర్ల మృతి

Also Read :  ప్రియుడితో సుఖం.. కన్నబిడ్డలకు రసగుల్లాలో విషం కలిపి చంపేసిన తల్లి!

Mosquito Drone Made By NUDT

ఆ డ్రోన్ గురించి ఎన్‌యూడీటీ విద్యార్థి టీవీ వీక్షకులకు వివరించారు. ఓ  ఈ తరహా మైక్రో డ్రోన్లు యుద్ధ రంగంలో శత్రువులకు సంబంధించిన సైనిక రహస్యాలను చిత్రీకరించి, తీసుకువస్తుందని అతను చెప్పాడు. చైనా శత్రు దేశాలకు ఇక కష్టకాలమే. ఈ సూక్ష్మ డ్రోన్లతో అమెరికా లాంటి దేశాలపై నిఘా పెంచవచ్చు. భవిష్యత్‌తో చైనాతో యుద్ధాలు వస్తే చైనా ఈ టెక్నాలజీ వాడుతుంది. 

Also Read :  ఘోరం.. హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ బ్లాస్ట్.. గాల్లోనే 8 మంది మృతి

Also Read :  ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం.. అన్నంత పని చేసిన ట్రంప్!

china | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | latest technology news in telugu | international news in telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు