/rtv/media/media_files/2025/06/24/vivo-t4-ultra-smartphone-huge-discount-on-flipkart-2025-06-24-13-07-29.jpg)
vivo t4 ultra smartphone huge discount on flipkart
వివో ఇటీవల vivo T4 Ultra 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో vivo T4 Ultra 5G ఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్ అందించారు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇప్పుడు దీని ధర, ఆఫర్‌లు గురించి తెలుసుకుందాం.
vivo T4 Ultra 5G Price & Offers
Vivo T4 Ultra ఫోన్‌లోని 8GB/256GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ సమయంలో రూ.40,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఇప్పుడు Vivo అధికారిక సైట్, Flipkartలో దీనిపై 7 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్‌తో ఈ ఫోన్ రూ.37,999 కి లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. HDFC లేదా SBI కార్డ్ పై రూ.3000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఈ తగ్గింపు తర్వాత రూ.34,999కి ఇది లభిస్తుంది. దీనితో పాటు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దాదాపు రూ.32,000 వరకు పొందొచ్చు.
Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్ సంచలన హెచ్చరిక
Vivo T4 Ultra Specifications
Vivo T4 Ultra ఫోన్ 6.67-అంగుళాల 1.5K క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అమర్చారు. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా FuntouchOS 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్ ఉంది.
Also Read: ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి కష్టమేనా ? రవిప్రకాశ్ సెటైరికల్ ట్వీట్
90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,500mAh బ్యాటరీ ఉంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో వస్తుంది. వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్-యాంగిల్ కెమెరా, 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్ సంచలన హెచ్చరిక