విజయనగరంలో టెర్రరిస్టుల కలకలం.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు

విజయనగరంలో టెర్రరిస్టులు సిరాజ్‌, సమీర్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక అంశాలు ప్రస్తావించినట్లు సమాచారం. ఆరుగురు వ్యక్తులు ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్‌ క్రియేట్‌ చేసుకున్నారు. ఇందులో సిరాజ్‌, సమీర్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నారని గుర్తించారు.

New Update
Vizianagaram terror case

విజయనగరంలో ఉగ్రమూలాల కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ కేసులో నిందితులు సిరాజ్‌, సమీర్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించినట్లు సమాచారం. ఆరుగురు వ్యక్తులు ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్‌ క్రియేట్‌ చేసుకున్నారు. అందులో సిరాజ్‌, సమీర్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నారని గుర్తించారు. ఈ ఆరుగురి టీం 3రోజుల పాటు హైదరాబాద్‌లో కలిసి తిరిగారు. సౌదీ నుంచి ఐసిస్‌ హ్యాండ్లర్‌ ఇచ్చే ఆదేశాల అమలుపై వీరు మాట్లాడుకున్నారు.

Also read: Corona: మరోసారి విజృంభిస్తున్న మహమ్మారి.. దేశవ్యాప్తంగా 257 కరోనా కేసులు

Also Read: 'శుభం' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమంత.. చీర లుక్‌ అదిరింది! (ఫోటోలు)

బాంబులు తయారు చేయాలని ఇద్దరికి సౌదీ నుంచి ఆదేశాలు వచ్చాయి. మిగతా నలుగురికి బాంబులు పెట్టే ప్రదేశాలు గుర్తించే పని అప్పగించారు. అరెస్టు సమయంలో సిరాజ్‌ వద్ద భారీగా పేలుడు పదార్థాలు లభించాయి. ఈ కేసు విషయంలో ఎన్‌ఐఏ అధికారులు విజయనగరం టూటౌన్‌ స్టేషన్‌కు వెళ్లారు. కేసుకు సంబంధించిన విషయాలపై అక్కడి పోలీసులతో ఎన్‌ఐఏ అధికారులు మాట్లాడారు.

Also read: Venkatesh - Trivikram: ఆ స్టార్ హీరోతో త్రివిక్రమ్ భారీ మల్టీస్టారర్..?

(vizianagaram | terrorist | attack in Pahalgam | isi | pakistan | india terror news | india terror attack | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు