/rtv/media/media_files/2025/05/19/ahKL9PqF9CiI6x07tKm9.jpg)
Venkatesh - Trivikram
Venkatesh - Trivikram: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కమిట్ కావడంతో, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తర్వాతి సినిమాను బన్నీ తో చేయాల్సింది, వేరే ఆప్షన్ లేక విక్టరీ వెంకటేష్‌తో చేయబోతున్నట్టు తేలిపోయింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ జూలైలో సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన సమాచారం ఒకటి వెలుగులోకి వచ్చింది.
చరణ్, త్రివిక్రమ్ మధ్య కీలక మీటింగ్
ఈ సినిమా మల్టీస్టారర్ కానుందని, రెండో హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం త్రివిక్రమ్ ప్రయత్నాలు చేస్తున్నారు. త్రివిక్రమ్, రామ్ చరణ్ కలిసి సినిమా చేయాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ, ఇప్పటి వరకూ అనేక కారణాల వల్ల అది కుదరలేదు. ఇక ఈసారి మాత్రం ఇద్దరూ సీరియస్‌గా ఈ ప్రాజెక్ట్ పై దృష్టిపెట్టారని సమాచారం. వచ్చే వారం చరణ్, త్రివిక్రమ్ మధ్య కీలకమైన మీటింగ్ జరగనుంది.
ఇక రామ్ చరణ్ ప్రస్తుతం "పెద్ది"తో పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రగ్గ్డ్ లుక్‌లో కనిపించనుండటంతో, త్రివిక్రమ్ రూపొందించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌కు చరణ్ కొత్తగా మేకోవర్ కావాల్సి రావొచ్చు. కథ నచ్చితే చరణ్ ఈ ప్రాజెక్ట్‌కి డేట్స్ కేటాయించాల్సి ఉంటుంది.
త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని షార్ట్ షెడ్యూల్స్‌లో పూర్తి చేసి 2026 సంక్రాంతికి విడుదల చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. అయితే, ఇదే టైంలో మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయితే, ఈ సినిమా వేసవికి వాయిదా పడే అవకాశం ఉంది.
మరోవైపు చరణ్ సై అంటే, ఈ పవర్‌ఫుల్ మల్టీస్టారర్ కోసం త్రివిక్రమ్ వేరే హీరో కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. లేదంటే ఇంకొక స్టార్ హీరో కోసం త్రివిక్రమ్ వెంటనే సెర్చ్ ప్రారంభించాల్సి ఉంటుంది.
ఈ భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనుంది. ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయగా, ప్రీ ప్రొడక్షన్ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన రావచ్చు.