/rtv/media/media_files/2025/05/19/KUzD9L4PxmKS8ucS5SHB.jpg)
Windsor Pro electric SUV
Windsor Pro electric SUV: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా, భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో ఇటీవలే తన ఎలక్ట్రిక్ SUV వేరియంట్ ‘విండ్సర్ ప్రో’ను లాంచ్ చేసింది. బెస్ట్ బ్యాటరీ కెపాసిటీ, రిఫ్రెష్డ్ డిజైన్‌తో మార్కెట్లో అడుగుపెట్టిన ఈ వేరియంట్‌కు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించింది.
24 గంటల్లోనే 8,000 బుకింగ్‌లు - బెంగళూరులో ఒకేసారి 150 యూనిట్లు డెలివరీ!
విండ్సర్ ప్రో బుకింగ్స్‌ను ప్రారంభించిన 24 గంటల వ్యవధిలోనే 8,000 బుకింగ్‌లు నమోదు కావడం ఈ కారు పాపులారిటీని తెలియజేస్తుంది. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, కంపెనీ డెలివరీ ప్రాసెస్ ను వేగవంతం చేసింది. ఈ క్రమంలో బెంగళూరులోని 150 మంది కస్టమర్లకు ఒకేసారి వాహనాలను అప్పగించడం విశేషం.
అప్‌డేటెడ్ స్టైల్, కొత్త కలర్స్ విండ్సర్ ప్రో లో గోప్ప మార్పులు కాకపోయినా, కొన్ని కొత్త అప్‌డేట్స్‌తో కొత్తగా ఉంది. ముఖ్యంగా:
- కొత్త అల్యూమినియం అల్లాయ్ వీల్స్
- టెయిల్‌గేట్ పై ADAS బ్యాడ్జింగ్
- లైట్ టోన్ ఇంటీరియర్ డిజైన్
ఇవి కారును ప్రీమియంగా చూపిస్తున్నాయి. అంతేకాదు, సెలాడాన్ బ్లూ, అరోరా సిల్వర్, గ్లేజ్ రెడ్ వంటి ఆకట్టుకునే కొత్త కలర్ ఆప్షన్లు ఈ వేరియంట్‌లో అందుబాటులో ఉన్నాయి.
పెరిగిన బ్యాటరీ కెపాసిటీ, మెరుగైన రేంజ్
ఇప్పటికే మార్కెట్లో ఉన్న స్టాండర్డ్ విండ్సర్ మోడల్‌లో 38 కిలోవాట్ బ్యాటరీ ఉండగా, ఇది సుమారు 332 కిలోమీటర్ల రేంజ్ అందించేది. ఇక ఈ కొత్త విండ్సర్ ప్రో వేరియంట్‌లో ఉన్న 52.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా కంపెనీ ప్రకారం ఒకసారి చార్జ్ చేయడంతో సుమారు 449 కిలోమీటర్ల రేంజ్ పొందవచ్చు. దీని ద్వారా ఎక్కువ ప్రయాణాలు చేసే వినియోగదారులకు ఇది మరింత సౌకర్యంగా ఉంటుంది.
ధర, లభ్యత
ఎంజీ విండ్సర్ ప్రో వాహనం ప్రారంభ ధరగా రూ. 17.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కార్ కేటగిరీలో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ SUVలతో ఎంజీ విండ్సర్ ప్రో పోటీ పడుతోంది. శక్తివంతమైన బ్యాటరీ, ఆధునిక ఫీచర్లు, కొత్తగా డిజైన్ చేసిన ఇంటీరియర్ లాంటి అంశాలతో ఈ SUV మార్కెట్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
మెరుగైన బ్యాటరీ రేంజ్, ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ కొత్త వేరియంట్, ఈవీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఎలక్ట్రిక్ ఫ్యూచర్ వైపు అడుగులు వేస్తున్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు!