/rtv/media/media_files/2024/12/28/P79l9qMKUUKCj6n1Qvuf.jpg)
rains
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల ఈ నెల 24వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు తెలిపారు.
తెలంగాణలో ఈ జిల్లాల్లో..
తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఇది కూడా చూడండి:Producer AM Ratnam: ‘హరి హర వీరమల్లు’ నిర్మాతపై ఫిర్యాదు.. ఆందోళనలో ఫ్యాన్స్
🌧️ 𝗠𝗔𝗦𝗦𝗜𝗩𝗘 𝗥𝗔𝗜𝗡𝗙𝗔𝗟𝗟 𝗔𝗟𝗘𝗥𝗧: 21st – 26th July 🌧️
— Hyderabad Rains (@Hyderabadrains) July 20, 2025
𝐀 𝐒𝐭𝐫𝐨𝐧𝐠 𝐋𝐨𝐰 𝐏𝐫𝐞𝐬𝐬𝐮𝐫𝐞 𝐀𝐫𝐞𝐚 (𝐋𝐏𝐀) is set to drench entire Telangana with 𝗪𝗶𝗱𝗲𝘀𝗽𝗿𝗲𝗮𝗱 𝗥𝗮𝗶𝗻𝘀 over the next 6 days!
Entire Telangana will witness widespread rains, with East… pic.twitter.com/B5wVantEPV
ఇది కూడా చూడండి: రాజాసింగ్ సంచలన నిర్ణయం.. ‘ఉపఎన్నికల్లో పోటీ చేసి ఆ పార్టీని ఓడిస్తా’
ఏపీలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు
నేడు ఏపీ(Andhra Pradesh)లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
Update No-3 ⚠️⚠️: As the Vizianagaram storms collapsed at sea, #Visakhapatnam city will see continuous drizzles and cool weather for next 1 hour with light winds. While Krishna - West Godavari (Gudivada, Diviseema, Machilipatnam, Narsapuram belt) will 100% see good rains due to… pic.twitter.com/o2qWpMhJcc
— Andhra Pradesh Weatherman (@praneethweather) July 20, 2025