Producer AM Ratnam: ‘హరి హర వీరమల్లు’ నిర్మాతపై ఫిర్యాదు.. ఆందోళనలో ఫ్యాన్స్

'హరిహర వీరమల్లు' నిర్మాత A.M రత్నంపై TFCCలో రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఫిర్యాదు చేశాయి. ఆక్సిజన్, ముద్దుల కొడుకు, బంగారం చిత్రాల బకాయిలు రూ. 2.5 కోట్ల పైచిలుకు ఉన్నాయని ఆరోపించాయి. ‘HHVM’ విడుదలకు ముందే తమ డబ్బులు ఇప్పించాలని కోరారు.

New Update
A.M RA.M. Rathnamathnam

A.M. Rathnam

పవన్ కళ్యాణ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ జూలై 24న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాత ఏ.ఎం. రత్నంకు ఊహించని షాక్ తగిలింది. గతంలో ఆయన నిర్మించిన సినిమాల పంపిణీకి సంబంధించి చెల్లించాల్సిన బాకీలు ఉన్నాయంటూ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC)లో ఆయనపై రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఫిర్యాదు చేశాయి. 

Also Read: డైనోసార్‌ అస్థిపంజరానికి వేలంలో రూ.260 కోట్లు

Complaint On Producer AM Ratnam

ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్: ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ.. ఏ.ఎం. రత్నం నిర్మించిన 'ఆక్సిజన్' సినిమా పంపిణీ హక్కులకు సంబంధించి రూ. 2.5 కోట్లు వసూలు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేసింది. ఈ డబ్బును రత్నం ఇంకా తిరిగి చెల్లించలేదని ఆరోపణలున్నాయి. 

Also read: 'ఉరిశిక్ష రద్దు.. నిమిష ప్రియ విడుదల!'

మహాలక్ష్మి ఫిలిమ్స్: మహాలక్ష్మి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 'ముద్దుల కొడుకు', 'బంగారం' చిత్రాలకు సంబంధించి ఏ.ఎం. రత్నం నుండి రూ. 90,000 వసూలు చేయాల్సి ఉందని ఫిర్యాదు చేసింది.

'హరి హర వీరమల్లు' వంటి భారీ సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు ఈ ఫిర్యాదులు తెరపైకి రావడం గమనార్హం. తమకు చెల్లించాల్సిన బకాయిలను 'హరి హర వీరమల్లు' విడుదలయ్యేలోపు ఇప్పించాలని ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు TFCCని కోరాయి. అంతేకాకుండా ఈ విషయంలో ఇతర డిస్ట్రిబ్యూటర్లు కూడా తమకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. 

Also Read : ఇజ్రాయెల్, సిరియా మధ్య కాల్పుల విరమణ

ఈ ఫిర్యాదుల నేపథ్యంలో TFCC ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇది 'హరి హర వీరమల్లు' సినిమా విడుదలకు ఎలాంటి ఆటంకాలు కలిగిస్తుందోనని అభిమానులు ఆందోలన చెందుతున్నారు. 

Also Read : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్

Hari Hara Veera Mallu | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news

Advertisment
Advertisment
తాజా కథనాలు