Raja Singh: రాజాసింగ్ సంచలన నిర్ణయం.. ‘ఉపఎన్నికల్లో పోటీ చేసి ఆ పార్టీని ఓడిస్తా’

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆయన ఏ పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. దొంగలున్న కాంగ్రెస్ పార్టీలో అసలే చేరనని ఆదివారం ఆర్టీవీతో చెప్పారు.

New Update
MLA Raja singh

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆయన ఏ పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. MIM దోస్తీ ఉన్న, దొంగలున్న కాంగ్రెస్ పార్టీలో అసలే చేరనని ఆదివారం ఆర్టీవీతో చెప్పారు. ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్చించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. నేను పక్కా హిందూ నేతను.. ఏ పార్టీలో చేరేది లేదని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఉప ఎన్నిక వచ్చినా ఎలాంటి అభ్యంతరం లేదు. గోషామహల్‌లో ఎవరు పోటీ చేసినా.. వాళ్లను ఓడిస్తా అని అన్నారు.

Also Read :  CRPF జవాన్‌ను చితకబాదిన శివభక్తులు.. వీడియో వైరల్

Also Read :  దారుణం.. టీచర్‌ అనుమానాస్పద మృతి.. తీవ్ర గాయాలతో భర్త

Also Read :  20 ఏళ్లు కోమాలో ఉన్న సౌదీ ‘స్లీపింగ్‌ ప్రిన్స్‌’ కన్నుమూత

Raja Singh Sensational Comments

గోషామహాల్‌ నియోజకర్గంలో ఉపఎన్నిక వస్తే మళ్లీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. బీజేపీ పార్టీని అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా వారిని ఓడిస్తానని అన్నారు. గోషామహాల్ ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచి తన సత్తా ఏంటో చూపిస్తానని అన్నారు. కొంతకాలంగా రాష్ట్ర బీజేపీ నాయకులతో విభేదాలు ఉన్న ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా పని చేసిన వారిపై విమర్శలు చేశారు. ఒకవేళ బీజేపీ మాధవి లతని పోటీలోకి దింపినా.. ఆమెను ఓడిస్తానని రాజా సింగ్ చెప్పారు.

AlsoRead :  దారుణం.. అప్పుల బాధ తట్టులేక ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య

bjp mla raja singh resign | bjp mla raja singh resigns | bjp Raja Singh | BJP MLA Raja Singh Sensational Comments

Advertisment
Advertisment
తాజా కథనాలు