Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్.. స్కూల్స్‌కి సెలవులు!

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల విశాఖపట్నం, అనకాపల్లి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

New Update
Rains

Rains

ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఏపీలోని కొన్ని జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంటున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఇది కూడా చూడండి:  మరో గంటలో తెలుగు రాష్ట్రాల్లో కండపోత వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!

ఏపీలో ఈ జిల్లాల్లో..

ఈ అల్పపీడనం ప్రభావం(ap weather update today) వల్ల శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, తిరుపతి, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

భారీ వర్షాల(Heavy Rains) కారణంగా విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు మన్యం, విజయనగరం జిల్లాలోని స్కూల్స్‌కు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలకు జిల్లా కలెక్టర్ సెలవులు ప్రకటించారు. అధిక వర్షాల కారణంగా విద్యార్థుల రాకపోకలకు ఇబ్బది కలగకుండా ఉండేందుకు కలెక్టర్ సెలవులు ఇచ్చారు. అలాగే అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మత్స్యకారులు అయితే వేటకు వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణలో ఈ జిల్లాల్లో..

ఏపీతో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో పాటు వరంగల్, కరీంనగర్, నిజమాబాద్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

ఇది కూడా చూడండి: Telangana Rain: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ

Advertisment
తాజా కథనాలు