Nayanthara-Vignesh: జానీ మాస్టర్ ఎఫెక్ట్.. నయనతార, విఘ్నేష్‌పై దుమ్మెత్తి పోస్తోన్న నెటిజన్లు!

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు కాగా కొన్ని రోజులు జైల్లో ఉండి బెయిల్ మీద రిలీజైన విషయం తెలిసిందే. అయితే జానీ మాస్టర్‌ను నయనతార, విఘ్నేష్ శివన్‌లు వారి సినిమాకి ఎంచుకోవడంతో నెటిజన్లు వారిపై తీవ్రంగా మండి పడుతున్నారు.

New Update
Nayanthara- Vignesh

Nayanthara-Vignesh: ఓ మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిననట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు కాగా కొన్ని రోజులు జైల్లో ఉండి బెయిల్ మీద రిలీజైన విషయం తెలిసిందే. అయితే జానీ మాస్టర్‌ను నయనతార(Nayanatara), విఘ్నేష్ శివన్‌లు వారి సినిమాకి ఎంచుకున్నారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియాలో ప్రకటించడంతో నెటిజన్లు వారిపై తీవ్రంగా మండి పడుతున్నారు.

ఇది కూడా చూడండి: Woman Kills Husband: మామతో సరసాలు.. పెళ్లైన 45 రోజులకే భర్తను లేపేసింది

ఇది కూడా చూడండి:China: మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం.. రహస్యంగా మిలిటరీ నగరాన్ని నిర్మిస్తున్న చైనా !

చిన్మయి స్పందన..

మైనర్ వేధింపులు చేసిన ఇలాంటి డైరెక్టర్‌పై వేటు వేయకుండా ఎందుకు అవకాశం ఇచ్చారని అంటున్నారు. మరికొందరు జానీ మాస్టర్ టాలెంట్‌ను గుర్తించారని, మంచి పనిచేశారని నయనతార, విఘ్నేష్‌ను ప్రశంసిస్తున్నారు. అయితే నయనతార, విఘ్నేష్ శివన్‌లు నిర్మిస్తున్న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సినిమా కోసం కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్‌‌ను తీసుకున్నారు. జానీ మాస్టర్ ఫొటోలను షేర్ చేసి ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో వీరిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటనపై టాప్‌ సింగర్‌ చిన్మయి శ్రీపాద కూడా స్పందించారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో బెయిల్‌తో బయకు వచ్చిన ప్రతిభావంతులైన నేరస్థులను ప్రోత్సహిస్తు్న్నారని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చూడండి:Oppo Reno 14 5G: అప్పు చేసైనా ఒప్పో కొనేయాలి భయ్యా.. 50MP+50MP కెమెరాతో కొత్త ఫోన్

Advertisment
Advertisment
తాజా కథనాలు