India-Pakistan: చావు భయం.. నదిలో దూకి ప్రాణాలు పోగొట్టుకున్న ఉగ్రవాది- వీడియో చూస్తే

జమ్మూకశ్మీర్‌‌లోని పహల్గాంలో ఉగ్రవాదులకు సహాయం చేసిన ఓ వ్యక్తి భద్రతా బలగాల నుంచి తప్పించుకునే క్రమంలో నదిలో దూకి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. టెర్రరిస్టుల ఆచూకి చెప్తానంటూ వెళ్లిన అతడు నదిలో దూకాడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది.

New Update

ఇటీవల జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రాదాడి ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులను భారత భద్రతా బలగాలు ఏరిపారేస్తున్నాయి. వరుసగా ఒక్కొక్కరిని మట్టుబెడుతున్నాయి. వాళ్లకు సంబంధించిన ఇళ్లను సైతం నేలమట్టం చేశాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులకు సహాయం చేసిన ఓ వ్యక్తి ఇటీవల భద్రతా బలగాలకు పట్టుబడ్డాడు. 

Also Read :  కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!

అనంతరం వారి నుంచి తప్పించుకునే క్రమంలో నదిలో దూకి పారిపోవాలని ప్రయత్నించాడు. కానీ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. దీంతో ఈ ఘటనకు భద్రతా బలగాల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని నెట్టింట విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో రిలీజ్ కావడంతో ఇందులో భద్రతా బలగాల తప్పులేదని పలువురు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read :  దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్

terrorist jumps into river

ఇటీవల కుల్గాం జిల్లాలో ఇంతియాజ్‌ అహ్మద్‌ మాగ్రే (23)ను భద్రతా బలగాలు అరెస్టు చేశారు. టెర్రరిస్టులకు సహాయం చేసినట్లు సమాచారం రావడంతో అతడిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇంతియాజ్‌ను విచారించారు. ఈ విచారణలో భాగంగా ఇంతియాజ్ సంచలన విషయాలు బయటపెట్టాడు. టెర్రరిస్టులకు ఆహారం, ఆశ్రయం కల్పించానని ఇంతియాజ్ అహ్మద్‌ ఒప్పుకున్నాడు. 

Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం

అనంతరం టెర్రరిస్టులను బయటకు రప్పించేందుకు సహాయం చేస్తానని భద్రతా బలగాలను బాగా నమ్మించాడు. ఇందులో భాగంగానే నిన్న (ఆదివారం) ఉదయం టెర్రరిస్టుల జాడ తెలుసుకునేందుకు పోలీసులు, ఆర్మీ బలగాలు అతడి వెంట వెళ్లాయి. ఈ క్రమంలో ఇంతియాజ్‌ వేషా వారి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. నది సమీపంలోకి వెళ్లగానే.. వెంటనే అందులోకి దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. జోరుగా ప్రవహిస్తున్న నదిలోకి దూకేశాడు. కొంత వరకు ఈత కొట్టాడు. కానీ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అందులో కొట్టుకుపోయి మునిగిపోయాడు. 

Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!

ఈ ఘటనపై మొదట ఫేక్ ప్రచారం జోరుగా సాగింది. జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. విచారణకు తీసుకెళ్లిన యువకుడు నదిలో శవమై తేలాడని ఆమె ఆరోపించారు. ఇంతియాజ్‌ మృతిలో కుట్రకోణం ఉందని అన్నారు. అయితే ఇంతియాజ్ తప్పించుకునేందుకు నీటిలో దూకిన వీడియో బయటకు రావడంతో ఇందులో ఎవరి ప్రమోయం లేదని అందరికీ అర్థం అయింది.

pahalgam | Pahalgam attack | pahalgam army operation | pahalgam attack latest updates | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు