బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ప్రమాద హెచ్చరికలు జారీ

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీన పడిందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలోని అన్ని పోర్టులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 65 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు తెలిపారు.

New Update
rains ap

rains

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడిందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో విశాఖ తీరం వెంబడి గంటకు 65 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఉన్న అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. రైతులు కాస్త అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు తెలిపారు. 

ఇది కూడా చూడండి: బెనిఫిట్ షోలు చిన్న పార్ట్.. సీఎం మాకు ఏం చెప్పారంటే.. దిల్ రాజు సంచలన ప్రెస్ మీట్!

ఇది కూడా చూడండి: Virat Kohli: కోహ్లీకి బిగ్ షాక్.. ఢీకొట్టినందుకు భారీ ఫైన్

ఏపీతో పాటు తమిళనాడులో..

అల్పపీడనం కారణంగా ఏపీతో పాటు తమిళనాడులో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, కడప, అనంతపురం, కర్నూలు, సత్యసాయి, కృష్ణా, నంద్యాల, బాపట్ల, పల్నాడు,అన్నమయ్య, చిత్తూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కళింగపట్నం, తుని, నందిగామ, గన్నవరం, జంగమేశ్వరపురం, ఒంగోలు, కావలి, నంద్యాల ప్రాంతాల్లో వర్షాలు కరుస్తాయి. 

ఇది కూడా చూడండి: బన్నీపై నాకు కోపం లేదు.. మేం కలిసి తిరిగాం.. రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Advertisment
తాజా కథనాలు