బన్నీపై నాకు కోపం లేదు.. మేం కలిసి తిరిగాం.. రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

సినీ ప్రముఖులతో ఈరోజు జరిగిన భేటీలో సీఎం రేవంత్ హీరో అల్లు అర్జున్ గురించి ప్రస్తావించారు. 'అల్లు అర్జున్ పై నాకెందుకు కోపం ఉంటుంది.. బన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చట్ట ప్రకారం వ్యవహరించాలనేది నా అభిప్రాయం'' అని స్పష్టం చేశారు.

New Update
CM Revanth and Allu Arjun

CM Revanth and Allu Arjun

CM Revanth Reddy:  టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈరోజు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సినీ పెద్దలు నాగార్జున, వెంకటేష్, రాఘవేందర్ రావు, మురళీమోహన్, నిర్మాతలు దిల్ రాజ్, అల్లు అరవింద్ పలువురు ఈ భేటీకి హాజరయ్యారు.  సినీ పరిశ్రమ అభివృద్ధి, ఇతర అంశాల గురించి సీఎంతో  చర్చించారు.  ఈ క్రమంలో రేవంత్ రెడ్డి హీరో అల్లు అర్జున్ గురించి ప్రస్తావించారు. 

బన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు.. 

ముఖ్యమంత్రి రేవంత్ బన్నీ గురించి మాట్లాడుతూ.. ''అల్లు అర్జున్ అంటే నాకెందుకు కోపం ఉంటుంది?.. బన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నాతో కలిసి తిరిగాడు. వ్యక్తిగత విషయాలు, అభిప్రాయాలూ ఎలా ఉన్నప్పటికీ.. చట్ట ప్రకారం వ్యవహరించాలనేది నా విధానం'' అని వ్యాఖ్యానించారు. 

ALSO READ: సైబర్ కేటుగాళ్ల కొత్త స్కామ్.. సిమ్‌ స్వాప్‌ చేసి రూ.7 కోట్లు కొట్టేశారు!

అలాగే రేవంత్ ఈ భేటీలో పలు కీలక విషయాలు మాట్లాడారు. తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలో ఉండవని.. టికెట్ రేట్స్ పెంపు జరగదని స్పష్టం చేశారు.  తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే తెలంగాణ అభివృద్ధిలో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలని సూచించారు.  డ్రగ్స్‌ క్యాంపెయిన్‌, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలని పేర్కొన్నారు.  ప్రపంచ స్థాయిలో ఫిల్మ్ షూటింగ్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లను  ప్రభుత్వం తరుపున చేస్తామని సీఎం తెలిపారు.

ALSO READ: కామారెడ్డిలో విషాదం..ఒకేసారి మహిళా కానిస్టేబుల్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ మృతి..ఎస్సై అదృశ్యం!

ALSO READ: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?

Advertisment
తాజా కథనాలు