DIL RAJU: టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈరోజు ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సినీ పెద్దలు సినీ పరిశ్రమకు సంబంధించిన పలు విషయాలను సీఎం రేవంత్ తో చర్చించారు. రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం నిర్మాత దిల్ రాజ్ మీడియా ముందు మాట్లాడుతూ.. FDC చైర్మన్ గా ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రిని కలవడానికి ఈరోజు అవకాశం వచ్చిందని.. ఫిల్మ్ ఇండస్ట్రీ, ప్రభుత్వానికి వారధిగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ అన్నారని. సినీ పరిశ్రమ అభివృద్ధి పైనే చర్చ జరిగిందని.. టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలపై ఇంకా చర్చ జరగలేదని దిల్ రాజ్ తెలిపారు.
ALSO READ: కామారెడ్డిలో విషాదం..ఒకేసారి మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతి..ఎస్సై అదృశ్యం!
ఇంటర్నేషనల్ సినీ హబ్ గా హైదరాబాద్
ఇంకా మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయిలో ఫిల్మ్ షూటింగ్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు ప్రభుత్వం తరుపున చేస్తామని సీఎం చెప్పారు. తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమాలు కూడా హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. ఇకపై హైదరాబాద్ ను సినీ పరిశ్రమకు ఇంటర్నేషనల్ హబ్ గా మార్చాలని ఈ భేటీలో చర్చించాము. అలాగే డ్రగ్స్ రహిత సమాజానికి అవసరమైన ప్రమోషన్లు సినీ సెలెబ్రెటీలు చేయాలని ముఖ్యంమత్రి కోరారు. అందుకు ఇండస్ట్రీ కూడా ఆమోదం తెలిపిందని దిల్ రాజ్ తెలిపారు.
ALSO READ: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?