Seema Haider: క్షుద్రపూజలు చేసిన సీమా హైదర్‌... ఇంట్లోకి యువకుడిని రప్పించుకొని..!

గుజరాత్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని సీమా హైదర్ ఇంట్లోకి చొరబొడ్డాడు. ఆమెపై దాడి చేస్తుండగా సీమా భర్త పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. అతనిపై సీమా హైదర్ క్షుద్రపూజలు చేసిందని, ఆమెని నిలవరించడానికి ఇక్కడికి వచ్చానని యువకుడు పోలీసులకు చెప్పాడు.

New Update
seema haider

పహల్గాం ఉగ్రదాడితో పాక్‌, భారత్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల పౌరులను సొంత దేశాలకు వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్‌లో భర్తను వదిలేసి నలుగురు పిల్లలతో ప్రియుడి కోసం భారత్‌కు వచ్చేసింది సీమా హైదర్‌(37). ప్రియుడు సచిన్‌ మీనాను పెళ్లాడి ఓ బిడ్డను సైతం కన్నది. సీమా హైదర్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అతను చెప్పిన విషయాలు విని అందరూ షాక్ అయ్యారు.

Also read: Naa Anveshana Police Case: నా అన్వేష్‌‌కు BIG షాక్ : కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు

ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆమెను పాక్‌కు పంపించాలా? వద్దా? అనేదానిపై అధికారులు సతమతమవుతున్నారు. తాను మాత్రం భారత్ కోడలినేనని, తనని మళ్లీ పాకిస్తాన్ పంపించొద్దంటూ ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిని ఆమె వేడుకుంటోంది. ఇదిలా ఉండగా.. ఓ వ్యక్తి సీమా హైదర్‌ ఇంట్లోకి చొరబడ్డాడు. వెనుక నుంచి వెళ్లి ఆమెపై దాడికి ప్రయత్నించబోయాడు. అయితే అది గమనించిన ఆమె భర్త సచిన్‌ ఆ దుండగుడిని పట్టుకున్నాడు. స్థానికుల సాయంతో పోలీసులకు అప్పగించాడు. సదరు నిందితుడి తేజాస్‌గా పోలీసులు నిర్ధారించారు.

Also Read: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?

ఆమె శుద్రపూజలను నిలవరించడానేకి..

గుజరాత్‌ సురేందర్‌‌నగర్‌కు చెందిన తేజస్‌. న్యూఢిల్లీకి రైలు ద్వారా వచ్చాడు. అక్కడి నుంచి బస్సులో సీమా హైదర్‌ ఉంటున్న గ్రేటర్‌ నోయిడా ప్రాంతానికి చేరుకున్నాడు. అతని ఫోన్‌లో సీమా హైదర్‌కు చెందిన ఫొటోల స్క్రీన్‌ షాట్స్‌ ఉన్నాయి. అయితే సీమా హైదర్ తనపై చేతబడి చేస్తోందని.. అందుకే ఆమెను కట్టడి చేయడానికి ఇక్కడికి వచ్చానని తేజస్‌ చెబుతున్నాడు. ఇది నమ్మశక్యంగా లేదని పోలీసులు అతన్ని అనుమానిస్తున్నారు. తేజస్ ఏ ఉద్దేశంతో ఆ ఇంట్లోకి చొరబడ్డాడు అనేది తెలియాల్సి ఉందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని మానసిక స్థితి పరిశీలిస్తున్నారు.

seema-haider | Pakistan Woman | uttara-pradesh | PUBG game | india | gujarat | latest-telugu-news | house | greater-noida

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు