/rtv/media/media_files/2025/05/04/i80LGRIuqyVr1bZRP106.jpeg)
Naa Anveshana Police Case
Naa Anveshana Police Case: ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్ అన్వేష్(Youtuber Naa Anvesh) పై హైదరాబాద్‌లో పోలీస్ కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్స్‌పై ప్రమోషన్లు(Betting App Promotions) చేసిన వారిపై అన్వేష్ వరుసగా వీడియోలు రిలీస్ చేస్తున్న విషయం తెలిసిందే. డీజీపీ, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితోపాటు పలువురిపై అన్వేష్ సంచలన ఆరోపణలు చేశాడు. రూ.300 కోట్లు కొట్టేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నాడని సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. గతకొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేస్తున్నవారిని టార్గెట్ చూస్తూ అన్వేష్ వీడియోలు విడుదల చేస్తున్నారు. అందులో పలువురు హీరోలు, సెలబ్రెటీలు, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు, యాంకర్లు, బిగ్ బాస్ కటెస్ట్‌టెంట్లు ఉన్నారు. వారు వందల కోట్లు డబ్బులు తీసుకొని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని అన్వేష్ ఆరోపించాడు. అన్వేష్ విదేశాల్లో నుంచి వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నాడు.
Cyberabad police have registered a suo motu case against travel vlogger and YouTuber Anvesh for publishing a series of controversial videos related to betting app promotions on Hyderabad Metro.
— Hyderabad Mail (@Hyderabad_Mail) May 4, 2025
Anvesh had uploaded multiple videos alleging that betting apps were promoted through… pic.twitter.com/lebb1v9JR9
Also Read: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?
అన్వేష్ సంచలన ఆరోపణలు
అన్వేష్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఓ కానిస్టేబుల్ ఫిర్యాదు చేశాడు. దీంతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌పై మాజీ సీఎస్ శాంతికుమారి, ఐఏఎస్‌లపై అవినీతి ఆరోపణలు చేస్తూ వీడియోలు చేశాడు. ఈక్రమంలోనే అతనిపై పోలీస్ కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. ప్రస్తుతం అతను విదేశాల్లో ఉన్నాడు. దీంతో అన్వేష్‌పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
Also Read: మంచితనం నటిస్తారు.. ఇండస్ట్రీపై చిర్రెత్తిపోయిన హాట్ బ్యూటీ!
Also Read: రూల్స్ మాకేనా, మీకు లేవా? పోలీస్ వాహనాలపై రూ.68 లక్షల చలాన్లు
(naa anveshana | naa anveshana trolls | naa anveshana sajjanar | naa anveshana fight | naa anvesh on bsy)