బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ప్రస్తుతం నాలుగో టెస్ట్ మ్యాచ్ మెల్‌బోర్న్‌లో జరుగుతున్నాయి. అయితే ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో ఇన్నింగ్స్‌లో 40వ ఓవర్‌లో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మూడు క్యాచ్‌లను మిస్ చేశాడు. దీంతో యశస్విపై కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది కూడా చూడండి: ఆరోజు 'పుష్ప' నిర్మాతలే థియేటర్ తీసుకున్నారు.. నోటీసులపై సంధ్య థియేటర్ రిప్లై OH MY GOD, Yashasvi Jaiswal just dropped Pat Cummins for the third time today.Rohit Sharma is on fire, visibly furious on the field. #INDvsAUS #AUSvIND #AUSvsIND pic.twitter.com/p4sij7e10C — Third Man (@ThirdManX) December 29, 2024 జైస్వాల్ విషయంలో రోహిత్ బాడీ లాంగ్వేజ్‌పై విమర్శలు.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే జైస్వాల్ క్యాచ్‌లను మిస్ చేసినప్పుడు రోహిత్ బాడీ లాంగ్వేజ్ ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ మైక్ హస్సీకి నచ్చలేదట. భారత్ కెప్టెన్ అలా స్పందించడం బాధాకరమన్నారు. మ్యాచ్‌లో వికెట్లు తీయడం ముఖ్యమే కానీ.. దేశానికి ప్రశాంతత, మద్దతు గల సందేశాన్ని ఇవ్వాలని మైక్ తెలిపారు. ఇది కూడా చూడండి: Rythu Bharosa: రైతు భరోసాపై భట్టి విక్రమార్క సంచలన కామెంట్స్ కేవలం మైక్ మాత్రమే కాకుండా మరో కొందరు కూడా రోహిత్ బాడీ లాంగ్వేజ్‌ను విమర్శించారు. ఆస్ట్రేలియా మహిళా కెప్టెన్ అలిస్సా హీలీ కూడా ఈ విషయంపై స్పందించారు. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో జైస్వాల్ కీలక పాత్ర పోషించాడని, అతని పట్ల జట్టు సున్నితంగా వ్యవహరించాలని ఆమె అన్నారు. కెప్టెన్ స్థానంలో ఉండి కాస్త కూల్‌గా ప్రవర్తించి ఉండాలని అంటున్నారు. ఇది కూడా చూడండి: ప్రశ్నపత్రం లీకేజీ.. అభ్యర్థులపై పోలీసుల లాఠీఛార్జీ ఇది కూడా చూడండి: Ap: జనసేనలోకి తమ్మినేని సీతారాం..క్లారిటీ ఇచ్చేసారుగా..!